Pamphlets

Pamphlets

వాళ్ళేమిస్తామంటున్నారు? మనకేం కావాలి?

సాధ్యం కాని ప్రతేక హోదా డిమాండ్‌తో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా సమర్థించారు. మన రాష్ట్రంలోని పార్టీలన్నీ బిజెపి దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎన్నడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆ బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలను, అభ్యర్థులను కొన్ని మౌలికమైన అంశాలను గురించి అడుగుదాం!

Pamphlets

మన ఓటును ప్రజలనూ, ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యంగాన్నీ గౌరవించే పార్టీకే వేద్దాం

ఇన్ని దారుణాలకు కారణమైన పార్టీలన్నీ నేడు ఓట్లు అడగటానికి మళ్లీ మన ముందుకు రాబోతున్నాయి. మీరు ఎంత అవినీతికైనా పాల్పడండి కానీ, మాకు ఎలక్టోరల్‌ బాండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయల చందాలు మాత్రం ఇవ్వండి, మీ రక్షణ బాధ్యత మాది అని అవినీతిపరులకు అండగా నిలిచిన ప్రస్తుత ప్రభుత్వం బరితెగింపు సుప్రీంకోర్టు ఆపితే కానీ ఆగలేదు. మళ్ళీ నిస్సిగ్గుగా వారే అవినీతిపరుల భరతం పడతామని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లుగా మన బాధ్యత ఏమిటి? సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగల పార్టీని ఎన్నుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చాలామంది అనుకుంటుంటారు. కాని వారి ఆలోచనలు దుర్మార్గమైనవి అయినప్పుడు వాళ్ళు చేయగల హాని కూడా అదే మోతాదులో ఉంటుందని మరిచిపోకూడదు.

Pamphlets

ప్రతి మనిషికి ఒకే విలువ కోసం – 25 సంవత్సరాల హక్కుల కార్యాచరణ

తెలుగు రాష్ట్రాలలో యాభై సంవత్సరాలుగా సాగుతున్న హక్కుల ఉద్యమ ప్రస్థానంలో చిగురించిన విలువలను, అమరుల జ్ఞాపకాలను, విలువైన అనుభవాలను మూట కట్టుకొని అనేక కొత్త ఆశలతో, ఆలోచనలతో, సందిగ్ధ ప్రశ్నలతో 25 సంవత్సరాల క్రితం ఈ ప్రయాణం మొదలుపెట్టాం. హక్కుల దృక్పథం మీద జరిగిన సుదీర్ఘమైన, విలువైన చర్చల పర్యావసానంగా 1998లో HRF ఏర్పడింది. HRF ఒక విశాల దృక్పథంతో, స్వతంత్రంగా పనిచేసే హక్కుల సంస్థగా నిలబడి ఎదగడానికి వ్యవస్థాపక సభ్యులు వేసిన తాత్విక పునాదే కారణం. విలువల ఆధారంగా దగ్గరైన మనుషులు వాళ్ళు చేసే పని ద్వారా సమాజంలో హక్కుల సంస్కృతిని అభివృద్ధి చేస్తూ, వేళ్ళూనుకుని ఉన్న అనేక రకాల అసమానతలను, ఆధిపత్యాన్ని అణచివేతలను ఏదో ఓమేరకు తగ్గించే దిశగా కృషి చేయగలరని HRF ప్రయాణం గమనిస్తే అర్ధమౌతుంది. రాజ్యం, కులం, మతం, వర్గం, హిందుత్వ జెండర్‌, లైంగికత తదితర ఆధిపత్య వ్యవస్థల వలన అణచివేతకు గురౌతున్న అనేక ప్రజా సమూహాలకు HRF మద్దతుగా నిలబడింది.

Scroll to Top