Human Rights Forum
మానవ హక్కుల వేదిక
Press Statements (Telugu)
ప్రకృతి వైపరీత్యాల నివారణకు తగిన వ్యవస్థను బలోపేతం చేయాలి
ఆగస్టు చివరి వారంలో రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. కొన్ని పదుల మంది మనుషులు చనిపోయారు. 117 గ్రామాలు వరదల వల్ల నష్టపోయాయి. 58 వేల దాకా ఇళ్ళు దెబ్బ తిన్నాయి. ఇప్పటివరకు పూర్తిగా లెక్కలోకి రాని ఎంతో ఆస్తి నష్టం, వేలాది ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలలో ఈ నష్టం ఎక్కువగా జరిగింది.
ఓర్వకల్లు మండలంలోని మూడు క్వార్ట్జ్ గనులకు పర్యావరణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి
ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental Impact Assessment) ఈరోజు విచారణ జరుగుతోంది. వారు తమ నివేదికలో సంవత్సరంలో 270 రోజులలో ఎంత ఖనిజం తయారు చేసేది చూపించారు. అయితే దీనిని తయారు చేసే క్రమంలో వెలువడే వాయు కాలుష్యం గురించి సమాచారం ఇవ్వకుండా, దాచి పెట్టి ప్రజల
Press Statements (English)
HRF Wants Quartzite Mining Lease Revoked, Public Hearing Cancelled
The Human Rights Forum (HRF) demands that the mining lease and all other permissions accorded to project proponent Ms VR Infra and Technologies for mining quartzite at ‘Pedda Konda’ near Kusuluvada village in Anandapuram mandal of Visakhapatnam district be immediately revoked. The public hearing for the project slated for 28-8-2024
Reports
భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన
వాతావరణ సంక్షోభం విషయంలో ప్రాధమికమైన అవగాహన కోరుకునే యువకులనూ, కార్యకర్తలనూ, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ దృష్టిలో పెట్టుకుని ఈ వుస్తకాన్ని రూపొందించాను. ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా అందరం భూతాప సమస్యతో తలపడాలని అభ్యర్థించడమే ఈ రచన ప్రధాన ఉద్దేశ్యం. చివరి అధ్యాయంలో ఈ విషయంలో మనం అనుసరించగల అంశాలను ప్రస్తావించాను.
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు
కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను తీసుకువచ్చిన తీరు, బలవంతంగానైనా వాటిని అమలు చేయాలని చూడడం, వారితో శత్రుదేశంతో వ్యవహరించినట్లు నిరంకుశంగా వ్యవహరించడం చూస్తున్న వారికి ఆ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏదో పెద్ద విషయమే ఉన్నదనే అనుమానం రాకుండా ఉండదు. ఇప్పటికే దేశంలో వ్యవసాయరంగం పీకల్లోతు సంక్షోభంలో ఉన్న విషయం, ముఖ్యంగా పేద, సన్నకారు రైతులకు అది ప్రాణాంతకంగా మారిన విషయం అందరం స్వయంగా చూస్తున్నాం. ఢిల్లీలో నిరసనలు తెలిపే వారు కోరుతున్నది వ్యవసాయ రంగాన్ని ఇంతకంటే అధోగతి పాలు చేయవద్దని మాత్రమే.
Bulletins
మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)
ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.
మానవ హక్కులు-2019 ( బులెటిన్-16)
ప్రజాస్వామ్య, లౌకిక విలువలకూ వ్యవస్థలకూ సమాధి కట్టి వాటి స్థానే హిందూత్వ ఆధిపత్య రాజకీయ సౌధాల నిర్మాణం దిగ్విజయంగా సాగుతున్న దుర్దినాలు ఒక వైపు కొనసాగుతుండగానే కొవిడ్-19 విరుచుకు పడి సమాజాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెట్టింది. కరోనాకు ఎటువంటి వివక్ష లేదని అనుకున్నా, అది మిగిలిన వారికంటే అణగారిన సమూహాలకు తలపెట్టిన హాని అంతాఇంతా కాదు. పేదల ఆరోగ్యాలనే కాక వారిని ఆర్థికంగా కూడా చావుదెబ్బ తీసింది. ప్రభుత్వాలకు పేదల పట్ల కించిత్తు బాధ్యత, బాధ కూడా లేదన్న విషయానికి వలస కార్మికుల హైవే యాత్రలే సాక్ష్యం చెప్పాయి. కరువు, సాంక్రమిక వ్యాధుల వంటి వైపరీత్యాలు మానవాళిని ఒక అత్యవసర పరిస్థితిలోకి (ఎమర్జెన్సీ) నెట్టేసే సందర్భాల్లో సైతం పెట్టుబడి ఎంత అనైతికంగా ప్రవర్తించగలదో కొవిడ్-19 తేటతెల్లం చేసింది.
Books
వాకపల్లి: నేరము – శిక్ష
వాకపల్లి కేసులో నిందిత పోలీసులతో పాటు, వారి కంటే ఎక్కువగా కాకపోయినా వారితో సమానంగా అయినా, దర్యాప్తు సంస్థ కూడా విచారణకు గురైంది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా జడ్జి పోలీసులను నిర్దోషులుగా విడుదల చేశారు కానీ దర్యాప్తు జరిగిన పద్ధతి, దర్యాప్తు అధికారులు మాత్రం దోషులుగా నిలిచారు. సాధారణంగా కేసు దర్యాప్తులో జరిగిన లోపాల మీద స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరగదు. కాని లోపభూయిష్ట దర్యాప్తుపై తీర్పులు ఇచ్చే విధంగా న్యాయశాస్త్ర పరిధి ఇటీవలే విస్తరిస్తోంది. దర్యాప్తు లోపాల వల్ల పూర్తి న్యాయం పొందలేకపోయినా, పట్టు వదలకుండా 2007 నుండి ఈ కేసులో పోరాడినందుకు మహిళలకు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్పష్టంగా బయటకు అనకపోయినప్పటికీ, సెషన్స్ జడ్జి ఆ మహిళల సాక్ష్యాన్ని నమ్మినట్లు అర్థమవుతూనే ఉంది.
కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా?
బాలగోపాల్ గారు ఈ ప్రసంగంలో వేదకాలం నుండి నేటి కాలం వరకు కులం, కులవ్యవస్థ, వర్నధర్మం ఎలా రూపు దిద్దుకుంటూ వచ్చాయో, మిగతా దేశాల్లో లేని వర్ణధర్మం మన దేశంలో మాత్రమే ఎందుకుందో విపులంగా చెప్పారు. కులానికి ఉత్పత్తి వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని వివరించారు. మార్క్సిజం చెప్పే చారిత్రక భౌతికవాదం ఒక్కటే కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాలను అర్థం చేసుకోవడానికి సరిపోదని అన్నారు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ మూడూ – కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం అనేవి ఇంత అతి రూపం, తీవ్రరూపం ఎందుకు తీసుకున్నాయో అర్థమవుతుందని చెప్పారు.