భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన

ఈ వుస్తకాన్ని రచించే ముందు నేను వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో, తోటి సామాజిక కార్యకర్తలతో సంభాషణలూ, చర్చలూ, సమావేశాలు జరిపాను. పలువురి కార్యకర్తల పరిశోధనలను కూడా అధ్యయనం చేశాను. అలాగే వాతావరణ రంగానికి చెందిన కొన్ని సంస్థల నివేదికలు కూడా ఈ పుస్తక రచనకు
ఉపయోగపడ్డాయి. ఎన్‌.డి.సి (Nationally Determined Contributions-NDC), ఇ.డి.జి.ఎ.ఆర్‌ (Emissions Database for Global Atmospheric Research- EDGAR), ఐ.పి.సి.సి (Intergovernmental Panel on Climate Change-IPCC) నివేదికలు వాటిలో కొన్ని. అంతేగాక వాతావరణ సంక్షోభం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రామాలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను, వడగాడ్పుల నియంత్రణ విషయంలో తెలంగాణ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కూడా నేను పరిగణనలోకి తీసుకున్నాను. ఈ పుస్తకం
ఒక పాఠ్యపుస్తకం తరహాగా మారకుండా అందరికీ సులువుగా బోధవడాలనే ఉద్దేశ్యంతో ఆయా నివేదికలను నేను అదేపనిగా ఇక్కడ ప్రస్తావించలేదు. అయితే నేను ఆధారపడ్డ పుస్తకాలను, ఆన్‌ లైన్‌ సమాచార మూలాలను చివర్లో ఒక జాబితాగా ఇచ్చాను.

Scroll to Top