శిరోముండనం కేసు తీర్పులో న్యాయం నామమాత్రమే!

పత్రిక ప్రకటన
17 ఏప్రిల్ 2024

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం నామమాత్రంగానే ఉందని మానవ హక్కుల వేదిక భావిస్తుంది. నిందితులు నేరం చేశారని చట్టపరంగా నిర్ధారించడంలో న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించింది, అయితే శిక్షా కాలాన్ని ఖరారు చేయడంలో ఉదారవైఖరిని ఎంచుకుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ లో ఈ కేసులో ఉన్న రెండు సెక్షన్లలో గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష వేసే ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ కేవలం 18 నెలలు మాత్రమే శిక్షా కాలంగా ఖరారు చేయడంలో న్యాయస్థానం నేరం యొక్క కులాధిపత్య స్వభావాన్ని పరిగణనలోనికి తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ నేరం కేవలం బాధిత వ్యక్తుల పట్ట మాత్రమే జరిగినది కాదు, ఒక అణగారిన సమూహం పట్ల జరిగింది.

న్యాయస్థానం ఉదారంగా వ్యవహరించడానికి సహేతుకమైన కారణాలు ఏమీ లేవు. రకరకాల ఎత్తుగడలతో ఈ కేసును 28 ఏళ్ల పాటు సాగదీయడంలోనే నిందితుల స్థాయి, ఉద్దేశ్యము అర్థం అవుతున్నాయి. నిందితుల కుల ప్రాబల్యం వల్లనే రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వారికి కొమ్ముకాసాయి. శిక్షా కాలాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది. లేని పక్షంలో బాధితులు ప్రైవేటు అప్పీల్‌ చేసుకోవడానికి మా వేదిక పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.

యు జి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు
జి శివ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు
వై రాజేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జి రోహిత్‌, రాష్ట్ర కార్యదర్శి
April 2024, విజయవాడ

Note: వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ఇంతకుముందు తెచ్చిన కరపత్రాల కోసం కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చెయ్యండి.

శిరోముండనం నిందితులును కాపాడడానికి బాధితుల కుల, మతాలను మార్చేస్తారా?
శిరోముండనం కేసు: 20 ఏళ్లు దాటినా వెలువడని తీర్పు – యేడిద రాజేష్‌, నామాడి శ్రీధర్(మానవ హక్కుల వేదిక బులెటిన్ -15; అక్టోబర్ 2017)
శిరోముండనం నిందితులును ఈ ప్రభుత్వం, న్యాయస్థానాలు శిక్షిస్తాయా?

Related Posts

Scroll to Top