Press Statements (Telugu)

ఇథనాల్ ఫ్యాక్టరీనీ తాత్కాలికంగా నిలిపివేసి, నిపుణుల కమిటీ వేసి అన్నీ అంశాలు పరిశీలించాలి

ఈ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం లో ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు వదలకూడదని, ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలని రెండు షరతులున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా, ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి. కాలుష్య నియంత్రణ మండలి కుమ్మకు తోనే ఇదంతా జరుగుతూ వుండాలి.