Pamphlets

మన ఓటును ప్రజలనూ, ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యంగాన్నీ గౌరవించే పార్టీకే వేద్దాం

ఇన్ని దారుణాలకు కారణమైన పార్టీలన్నీ నేడు ఓట్లు అడగటానికి మళ్లీ మన ముందుకు రాబోతున్నాయి. మీరు ఎంత అవినీతికైనా పాల్పడండి కానీ, మాకు ఎలక్టోరల్‌ బాండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయల చందాలు మాత్రం ఇవ్వండి, మీ రక్షణ బాధ్యత మాది అని అవినీతిపరులకు అండగా నిలిచిన ప్రస్తుత ప్రభుత్వం బరితెగింపు సుప్రీంకోర్టు ఆపితే కానీ ఆగలేదు. మళ్ళీ నిస్సిగ్గుగా వారే అవినీతిపరుల భరతం పడతామని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లుగా మన బాధ్యత ఏమిటి? సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగల పార్టీని ఎన్నుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చాలామంది అనుకుంటుంటారు. కాని వారి ఆలోచనలు దుర్మార్గమైనవి అయినప్పుడు వాళ్ళు చేయగల హాని కూడా అదే మోతాదులో ఉంటుందని మరిచిపోకూడదు.