Press Statements (Telugu)

సాహితీ సదస్సుపై దాడి అనాగరికం

ఎంతో బాధ్యత కలిగిన సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సదస్సుపై ఎన్నికల కోడ్ అమలు అంటూ, రామున్ని ధూషిస్తున్నారంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ భౌతిక దాడికి దిగటం అనాగరికమైన పద్ధతి. వారి ఆరోపణల్లో నిజమే ఉంటే భౌతికదాడికి దిగకుండా వారు చట్టాన్ని ఆశ్రయించాల్సి ఉండింది. మతోన్మాద ప్రేరేపిత విద్యార్థులు వారి రాజకీయ నాయకుల ఆదేశాలతో చేసిన ఈ మూక దాడి ఆధునిక సభ్య సమాజానికి సిగ్గు చేటు.
భౌతిక దాడికి గురైన సాహితీవేత్తలతో ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడి వారిలో ఆత్మ విశ్వాసం నింపాలనీ, రాష్ట్రంలో ఇటువంటి మూక దాడులు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల వేదిక కోరుతున్నది. భౌతిక దాడులకు దిగిన వ్యక్తులపైనా, వారిని పంపిన రాజకీయ నాయకులపైనా వెంటనే కేసులు నమోదు చేయించి, అరెస్టు చేయించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం.