బీల కోసం …. బతుకు కోసం
పామును చంపిన చీమల దండులా ఉద్దానం ప్రజలు సృష్టించిన ఈ చరిత్ర మరుగున పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాము. చాలా ఆలస్యం
అయినప్పటికీ ప్రజలు తమ గుండెల్లో దాచుకున్న విషయాలను మా కోసం పునఃస్మరించుకున్నారు. ఆ కథనాలన్నీ పోగుచేసి మీ ముందు ఉంచుతున్నాము. అన్ని
సంఘటనలకూ ఇందులో చోటు దక్కకపోయి ఉండొచ్చు. సామాన్య ప్రజల విజయగాథను రికార్డు చేసే బృహత్ ప్రయత్నంలో కొన్ని విస్మరణకు గురై ఉండొచ్చు.
వాటిని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. హరిత ఉద్యమాలపై ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధనలు చేసే వారికీ ఈ పుస్తకం ఉపయోగపడాలని మా ప్రయత్నం.