పరిశ్రమల్లో మరణ మృదంగం: పారిశ్రామిక భద్రత, కాలుష్యాల పై నివేదిక
విశాఖపట్నం భారీ, మధ్యతరహా పరిశ్రమలకు నెలవు కావడంతో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా, జాతీయ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు పొందింది. తీరప్రాంత నగరం, సహజ నౌకాశ్రయం అన్న విశిష్టతలు నగరానికి ఒకరకంగా శాపంగా పరిణమించాయి. భారీ, మధ్య తరహా తయారీ పరిశ్రమలను, బల్క్ ఫార్మా పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా స్థాపించుకుంటూ పోవడంతో విశాఖ, దాని పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారాయి. కాలుష్యానికి తోడు పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలు అటు పరిశ్రమల సిబ్బందినీ, ఇటు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.