Press Statements (Telugu)

Press Statements (Telugu)

గంగవరం కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి

జూన్‌ 2023లో  జీపీఎస్‌ ఉద్యోగులు జీతాలు, ఉద్యోగాలు, హక్కులకోసం అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి  అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్‌ వారు విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వలేదు. దాని మీద వారంతా ఆందోళనకు దిగితే జిల్లా కలెక్టర్‌ సమక్షంలో అప్పట్లో ఒప్పందం కూడా జరిగింది. పదినెలలు గడిచినా ఒప్పందం అమలు కాకపోవడంతో తిరిగి కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మొత్తం గంగవరం గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడ్డారు. అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగులు కూడా వీరికి మద్దతుగా సమ్మె  బాట పట్టారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్య పక్షాన ఉండి పోరాటన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.

Press Statements (Telugu)

శిరోముండనం కేసు తీర్పులో న్యాయం నామమాత్రమే!

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం నామమాత్రంగానే ఉందని మానవ హక్కుల వేదిక భావిస్తుంది. నిందితులు నేరం చేశారని చట్టపరంగా నిర్ధారించడంలో న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించింది, అయితే శిక్షా కాలాన్ని ఖరారు చేయడంలో ఉదారవైఖరిని ఎంచుకుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ లో ఈ కేసులో ఉన్న రెండు సెక్షన్లలో గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష వేసే ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ కేవలం 18 నెలలు మాత్రమే శిక్షా కాలంగా ఖరారు చేయడంలో న్యాయస్థానం నేరం యొక్క కులాధిపత్య స్వభావాన్ని పరిగణనలోనికి తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ నేరం కేవలం బాధిత వ్యక్తుల పట్ట మాత్రమే జరిగినది కాదు, ఒక అణగారిన సమూహం పట్ల జరిగింది.

Press Statements (Telugu)

ఇథనాల్ ఫ్యాక్టరీ కాలుష్యాన్ని ప్రశ్నించిన చిత్తనూర్ గ్రామస్తులపై పోలీసు దాడులను ఖండించండి

ఈ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం లో ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు వదలకూడదని, ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలని రెండు షరతులున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా, ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి. కాలుష్య నియంత్రణ మండలి కుమ్మకు తోనే ఇదంతా జరుగుతూ వుండాలి.

Press Statements (Telugu)

ఎన్.ఐ.ఏ దాడులు హక్కుల కార్యకర్తలను భయపెట్టడానికే

ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) బాధ్యుల ఇళ్ళపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.) అక్టోబర్ 2, 2023 వేకువజామున చేసిన సోదాలు హక్కుల

Press Statements (Telugu)

గని విస్తరణ పేరిట జలాశయం పూడ్చివేత  

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నీటి వనరు మళ్లింపు పేరిట ఏకంగా జలాశయాన్నే పూడ్చేస్తున్నారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల సరిహద్దులో వట్టివాగు జలాశయాన్ని 1998 లో

Press Statements (Telugu)

సామాజిక వెలి హేయమైన చర్య

 ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు జరిమానా విధించడమే కాకుండా, సామాజిక బహిష్కరణ చేయడం హేయమైన చర్య అని, నాగరిక సమాజం సిగ్గుపడే ఈ ఘటనపై విచారణ జరిపి,

Press Statements (Telugu)

కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేయడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమే!

కోనసీమ జిల్లా పేరు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చినందుకు జరిగిన గొడవలలో నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని

Press Statements (Telugu)

చల్లపల్లి గ్రామంలో అక్రమంగా ఇల్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో గొలకోటి నాగలక్ష్మికి చెందిన పెంకుటింటిని  అక్రమంగా కూల్చేసిన విషయమై ఈ రోజు ముగ్గురు సభ్యుల మానవ హక్కుల

Press Statements (Telugu)

నిజాలు చెప్పి విస్తరణకు వెళ్ళండి

బలబద్రపురం గ్రామం బిక్కవోలు మండలంలో ఉన్న గ్రాసిం పరిశ్రమ కాస్టిక్‌ సోడా ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ప్రస్తుతం విస్తరించే ఆలోచనలో ఉన్నారు కనుక ప్రభుత్వ నియమాల ప్రకారం

Press Statements (Telugu)

జి. రాగం పేట ఫాక్టరీ ఘటనకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులను కూడా ముద్దాయిలుగా చేర్చాలి

పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామంలోని అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్ ఫాక్టరీ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు చనిపోయిన ఘటనకు సంబంధించిన విచారణ నివేదికను బహిర్గతం

Scroll to Top