శిరోముండనం కేసు తీర్పులో న్యాయం నామమాత్రమే!
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం నామమాత్రంగానే ఉందని మానవ హక్కుల వేదిక భావిస్తుంది. నిందితులు నేరం చేశారని చట్టపరంగా నిర్ధారించడంలో న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించింది, అయితే శిక్షా కాలాన్ని ఖరారు చేయడంలో ఉదారవైఖరిని ఎంచుకుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఈ కేసులో ఉన్న రెండు సెక్షన్లలో గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష వేసే ప్రొవిజన్ ఉన్నప్పటికీ కేవలం 18 నెలలు మాత్రమే శిక్షా కాలంగా ఖరారు చేయడంలో న్యాయస్థానం నేరం యొక్క కులాధిపత్య స్వభావాన్ని పరిగణనలోనికి తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ నేరం కేవలం బాధిత వ్యక్తుల పట్ట మాత్రమే జరిగినది కాదు, ఒక అణగారిన సమూహం పట్ల జరిగింది.



