
దేశమంతటా అన్ని నగరాలలోను, పట్టణాలలోను లెక్కకు మించిన మురికివాడలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఆసియాలో అతి పెద్ద మురికివాడ ముంబాయిలో ఉందని మనం ‘గొప్పగా’ కూడా చెప్పుకుంటాం. పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో, రైల్వే లైన్ల పక్కన, బ్రిడ్జీల పక్కన, నదుల ఒడ్డున, కొండల పక్కన, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ చిన్న పాకనో, గుడిసెనో వేసుకోవడంతో మురికివాడల ప్రజల జీవితం ప్రారంభం అవుతుంది. ఇంతమంది మనుషులు ఒక దగ్గర ఉండడంతో రాజకీయ నాయకులు వారిని ఓటు బ్యాంకులుగా పరిగణించి నీరు, కరెంట్, ఒకటో రెండో రేషన్ షాపులు వంటి కొన్ని మౌలిక అవసరాలను తీరుస్తారు. ప్రజలు వాటితోనే సంతోషించి. తమ జీవితాలు బాగుపడ్డాయనుకుంటూ ఆ గూళ్లనే భవంతులుగా సంతృప్తిపడుతూ, పిల్లల భవిష్యత్తు గురించి కలలు కంటూ జీవిస్తుంటారు.
వెల: రూ. 250/-
ప్రతులకు – నవోదయ బుక్ హౌస్