Press Statements (Telugu)

Press Statements (Telugu)

శిరోముండనం కేసు తీర్పులో న్యాయం నామ మాత్రమే!

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం నామమాత్రంగానే ఉందని మానవ హక్కుల వేదిక భావిస్తుంది. నిందితులు నేరం చేశారని చట్టపరంగా నిర్ధారించడంలో న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించింది, అయితే శిక్షా కాలాన్ని ఖరారు చేయడంలో ఉదారవైఖరిని ఎంచుకుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ లో ఈ కేసులో ఉన్న రెండు సెక్షన్లలో గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష వేసే ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ కేవలం 18 నెలలు మాత్రమే శిక్షా కాలంగా ఖరారు చేయడంలో న్యాయస్థానం నేరం యొక్క కులాధిపత్య స్వభావాన్ని పరిగణనలోనికి తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ నేరం కేవలం బాధిత వ్యక్తుల పట్ట మాత్రమే జరిగినది కాదు, ఒక అణగారిన సమూహం పట్ల జరిగింది.

Press Statements (Telugu)

ఇథనాల్ ఫ్యాక్టరీనీ తాత్కాలికంగా నిలిపివేసి, నిపుణుల కమిటీ వేసి అన్నీ అంశాలు పరిశీలించాలి

ఈ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం లో ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు వదలకూడదని, ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలని రెండు షరతులున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా, ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి. కాలుష్య నియంత్రణ మండలి కుమ్మకు తోనే ఇదంతా జరుగుతూ వుండాలి.

Press Statements (Telugu)

హక్కుల పరిరక్షణ పేరుతో ట్రాన్స్ జెండర్ హక్కుల భక్షణ

లోక్‌సభ ఇటీవల ఆమోదించిన ‘ట్రాన్స్ జెండర్ వ్యక్తుల ( హక్కుల రక్షణ) బిల్లు-2018’ లో అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. తమ హక్కులను పరిరక్షించే అంశాల కంటే

Press Statements (Telugu)

ఎదురుకాల్పుల దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆందోళనకరం

ఎదురుకాల్పులు (encounters) జరిగి మరణాలు సంభవించిన ప్రతి సందర్భంలోనూ  పోలీసులపై ప్రాధమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు భిన్నంగా

Scroll to Top