మానవ హక్కుల వేదిక పరిచయం

మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల గురించిపోరాడటానికి, ఆ హక్కుల ఉల్లంఘనలనుప్రతిఘటించటానికి ఏర్పడింది.ఇటువంటి ఎజెండా వున్న అన్ని హక్కుల సంఘాలతోనూ సారూప్యత ఉన్నమేరకు ఈ వేదిక కలిసి పనిచేస్తుంది. ఆర్ధిక, సాంఘిక, రాజకీయప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో హక్కుల ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనపాత్ర వుందని, దానిని ఈ ఉద్యమం పోషించాలని వేదిక భావిస్తుంది.

రాష్ట్రంలోని పౌరహక్కుల ఉద్యమం గత రెండున్నర దశాబ్దాలుగా తనఆచరణలోనూ, అవగాహనలోనూ రాజ్యాన్నీ, రాజ్యహింసనూ కేంద్రబిందువుగా చేసుకుంది. రాజ్యమే అన్నిరకాల అణచివేతలను, అసమానతలనుపెంచిపోషిస్తుంది కాబట్టి రాజ్యం చేసే హక్కుల ఉల్లంఘనలపై ఎక్కువ దృష్టిపెట్టాలనే అవగాహనతో పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక హక్కులసంఘాలు పనిచేస్తూ వచ్చాయి. రాష్ట్రంలో తర్వాత వచ్చిన స్త్రీవాద, దళిత,పర్యావరణ ఉద్యమాల నేపథ్యంలో హక్కుల అవగాహనను విస్తృతపరుచుకునే దిశలో పారప్రజాస్వామిక హక్కుల సంఘాలు తమ ప్రణాళికలనూ ఆచరణనూ మార్చుకుని కులం, జండర్‌, ప్రాంతీయ తత్వంమొదలగు వాటిని కూడా ఆధిపత్య వ్యవస్థలుగా గుర్తించడం మొదలుపెట్టాయి. అయితే ఆచరణలో రాజ్యం, దాని అణచివేత స్వభావం, అది చేసేహక్కుల ఉల్లంఘనలు ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చాయి. మానవహక్కులకున్న విస్తృత అర్ధంలో ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం జరగవలసి ఉంది.ఇటువంటి ప్రయత్నాలు చేసేందుకే మానవహక్కుల వేదిక ఏర్పడింది.

హక్కుల ఉద్యమ అవగాహనలో రాజ్యాన్ని గురించిన అవగాహనకూడా అంతగా ముందుకు పోలేదు. అణచివేత స్వభావంతో పాటు ప్రజలుపోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు కూడా రాజ్య నిర్మాణంలోభాగమేనని గుర్తించినా కూడా, అణచివేత స్వభావాన్ని హైలైట్‌ చేసినంతగా ప్రజల పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలను,చట్టాల్లో వచ్చిన మార్పులను ప్రజలకనుగుణంగా బలోపేతం చేసే దిశలోప్రయత్నాలు జరగలేదు. దాని వల్లప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనేహక్కుల ఉల్లంఘనల గురించి తగినంత కృషి జరగలేదు. దైనందినజీవితంలోని హక్కుల విషయంలోనే ఆధునిక రాజ్యం ద్వారా అమలులోకి తేబడిన సార్వజనీన సూత్రాలు, సామాజిక ఆచరణ ఆయా ప్రజలకుఅణచివేతను, అసమానతను వ్యతిరేకించటానికి ఉపయోగపడతాయనిదళిత, స్త్రీవాద, పర్యావరణ ఉద్యమాలే కాక రెండున్నర దశాబ్దాలపౌర/ ప్రజాస్వామిక హక్కుల ఉద్యమం కూడా స్పష్టం చేసింది. పోరాడేహక్కుతో పాటు ప్రజలు తమ దైనందిన జీవితాల్లో హక్కులను అనుభవించేదిశగా మానవహక్కుల ఉద్యమం తన ఆచరణను విస్తృత పరుచుకోవాలి.ఇటువంటి హక్కుల ఉద్యమాన్ని నిర్మించటం మానవహక్కుల వేదికలక్ష్యం.

రాష్ట్రంలో ఇటువంటి ప్రణాళికతో పనిచేస్తున్న ఆంధప్రదేశ్‌పౌరహక్కుల సంఘం వుండగా మానవహక్కుల వేదిక ఏర్పడటం నక్సలైటుపార్టీలు చేసే హింసను ఖండించటానికేనన్న వాదన చాలా బలంగావినపడుతోంది. నక్సలైటు పార్టీలు చేసే అప్రజాస్వామిక చర్యల గురించిపౌరహక్కుల ఉద్యమంలో జరిగిన చర్చను రాజ్యహింస వర్సస్‌ నక్సలైట్‌హింసగా కుంచించడం వల్ల ఏర్పడ్డ పరిణామమిది. దీనికి మీడియాసహకారం కూడా చాలానే వుంది. నక్సలైట్‌ పార్టీలు చేసే పనులు ప్రజలకు కొన్నిసార్లు అపకారం కలిగిస్తున్నా వాటిని విమర్శిస్తే రాజ్యయంత్రాంగానికితోడ్పడిన వాళ్ళమవుతామేమోనన్న భయం చాలా కాలంపాటు పౌరహక్కులఉద్యమకారులను వెంటాడింది. అయితే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినమనం ఈ విధంగా వెనకాడటం వల్ల జరిగేది నష్టమేనని ఈ మధ్య కాలంలోస్పష్టమవుతూ వచ్చింది. మానవ హక్కుల వేదిక రాజ్యహింసనూ, నక్సలైట్‌పార్టీలు చేసే అప్రజాస్వామిక చర్యలనూ ఒకే గాటనకట్టి చూడదు. అయితేనిజమైన ప్రజాస్వామ్యం కొరకు పోరాడుతున్నావుని చెప్పుకునేఉద్యమాలేవయినా అప్రజాస్వామికంగా ప్రవర్తించినపుడు మానవ హక్కులవేదిక వాటిని కచ్చితంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో పౌరహక్కులఉద్యమంలో అంతగా ప్రాధాన్యం పొందని  కొన్ని విషయాలను తీసుకొనిపనిచేయాలని వేదిక నిర్ణయించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top