Fact Finding Reports (Telugu)

NIMZ కోసం బలవంతపు భూసేకరణను నిలిపివేయాలి

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ  ప్రారంభించింది. ఈ మొత్తం భూమిలో 9 వేల ఎకరాల పట్టా భూమి పోను, దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్/ప్రభుత్వ  భూమి ఉంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా కాలంగా ఈ భూముల్లో  మెట్ట  పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ముందుగా దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సేకరించే ప్రయత్నం  చేసింది. పట్టా భూములకు ఇచ్చిన ధర కంటే  పేద రైతులు అభివృద్ధి చేసిన ఈ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లించారు.