Press Statements (Telugu)

అనుమతుల్లేని భూముల్లో ఆక్వా సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

సి ఆర్ జెడ్ పరిధిలో ఆక్వా సేద్యం చేయడం చట్ట విరుద్ధమని, అనుమతుల్లేని భూముల్లో సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం చట్టరీత్యా నేరమని, తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఎన్జీటీ తీర్పు రీత్యా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనుమతుల్లేని ఆక్వా సాగుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి వచ్చిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులను అడ్డుకోవడం రైతులకు తగదన్నారు.