Books (Telugu)

ప్రజా హక్కుల న్యాయవాది గొర్రెపాటి

మాధవరావు గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని స్మరించుకుంటూ హక్కుల రంగంలోని ఆయన సహచరులు పంచుకున్న జ్ఞాపకాలు, హక్కుల కోణంలో ఆయన రాసిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలను కలిపి ఈ పుస్తకం తీసుకొచ్చాం. ఇదివరకే చెప్పినట్టు ఆయన రచనా వ్యాసంగం హక్కుల వ్యాసాలకే పరిమితం కాదు. సాహిత్య, రాజకీయ, వ్యక్తిగత ఆసక్తులతో ఆయన రాసిన మరెన్నో వ్యాసాలు పలు పత్రికలలో వచ్చాయి. అవన్నీ ఆయనకు అశేష అభిమానులను సంపాదించి పెట్టాయి కూడా. వాటిని విడిగా ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయన అకాల మరణం వల్ల ఈ కృషి అర్ధంతరంగా ఆగిపోవడం కూడా ఎంతో బాధ కలిగించే విషయం.
మాధవరావు గారు గొప్ప స్నేహశీలి. మానవహక్కుల వేదిక సభ్యులందరితోనూ ఎంతో కలివిడిగా, ప్రేమపూర్వకంగా ఉండేవారు. చమత్కార సంభాషణలతో నిత్యం నవ్వులు పూయించేవారు. ఏ క్షణంలోనైనా ఆగిపోయే గుండె అని తెలిసినా ప్రతి క్షణం అర్థవంతంగా గడపడానికే ప్రయత్నించారు. ఈ పుస్తకం ఆయనకు మేము ఇస్తున్న ప్రేమపూర్వక నివాళి. హక్కుల రంగంలో ఆయన చేసిన కృషికి ఈ పుస్తకం అద్దం పడుతుందని ఆశిస్తున్నాం.