రాజ్యాంగాన్ని ఎలా చూడాలి?
మన దేశంలో మెజారిటీ ప్రజలకు ఇప్పటికీ రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు. తెలిసిన కోర్టులు ఎక్కువసార్లు కులీన, సంపన్న వర్గాల ఆలోచనల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడున్న మంచి చట్టాలను రద్దు చేయడానికి శాసనకర్తలైనా వెనకాడుతున్నారేమో గాని కోర్టులు మాత్రం అడగకుండానే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ పనిని సులభతరం చేస్తున్నారని బాలగోపాల్ ఒక వ్యాసంలో ఘాటుగా విమర్శించారు కూడా. హిందుత్వవాదుల అసలు లక్ష్యం రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమానత్వ విలువల్ని రాజ్యాంగం నుండి తొలగించడమే. ఆ పనిని వెంటనే చేయకపోయినా, రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నపుడు రాజ్యాంగ సమీక్ష పేరుతో చేసి తీరతారు. అప్పటిదాకా అన్ని రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని రాజ్యాంగాన్ని కొద్దికొద్దిగా మారుస్తూ, అందులోని సమానతా విలువల్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తారు. ఈ రెండు చర్యలనూ అడ్డుకోవడానికి మనకు రాజ్యాంగం పట్ల సరైన అవగాహన ఉండడం అవసరం. ఈ వ్యాసాలు ఆ అవగాహనను ఇస్తాయని నమ్ముతున్నాం.
