Human Rights Forum

The essence of Human Rights is the notion of equality in Human Value and Worth – Balagopal

మానవ హక్కుల వేదిక

మనిషిని మనిషిగా చూడటం సమాజానికీ పాలకులకూ నేర్పించే పోరాటమే మానవ హక్కుల పోరాటం – బాలగోపాల్

Press Statements (Telugu)

బానోతు దీపిక తల్లిదండ్రులను చంపిన ఉన్మాదిని శిక్షించాలి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయి గూడెం గ్రామ హామ్లెట్ 16 చింతల తండాలో 11వ తేదీ గురువారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల విషయంలో ఈరోజు మానవహక్కుల వేదిక బృందం బాధితులను కలిసి వివరాల సేకరించింది. మా నిజనిర్ధారణ బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి హరికృష్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షులు అద్దునూరి యాదగిరి

Read More »

మహ్మద్ హుస్సేన్ ను వెంటనే విడుదల చేయాలి

రచయిత, మాజీ మావోయిస్టు మహ్మద్ హుస్సేన్ ను పోలీసులు జమ్మికుంటలోని ఆయన ఇంటినుండి అక్రమంగా పట్టుకెళ్ళటాన్ని ఖండిస్తున్నాం. జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో ఉన్న మహమ్మద్ హుస్సేన్ ను ఈ రోజు తెల్లవారుజామున ఆరు గంటలకు పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి, అరెస్టు నోటీసు లేకుండా, బంధువులకు ఏ విషయమూ తెలియజేయకుండా జీపులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. మఫ్టీలో వచ్చిన వాళ్ళు పోలీసులమని చెప్పటం తప్ప, తాము

Read More »

Press Statements (English)

నాసిరకం విత్తనాలు, ఎరువులు, కల్తీ రసాయన మందులు అమ్ముతున్న వ్యాపారుల పై కేసులు నమోదు చేయాలి.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ నల్లగొండ గారికి నమస్కరించి మనవి చేయునది ఆర్యా! విషయం:- పై విషయం లో తమరికి మనవి చేయునది నల్లగొండ జిల్లా రైతాంగం సరైన వర్షాలు పడక ఎదురుచూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడక్కడ కొద్దికొద్దిగా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. బోర్ల యందు నీరు వసతి ఉన్నవారు నారుమల్లు సా గు చేసు కుంటూ కొద్దికొద్దిగా వరి మల్లు తడుపుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనపడుతుంది.

Read More »

Reports

భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన

వాతావరణ సంక్షోభం విషయంలో ప్రాధమికమైన అవగాహన కోరుకునే యువకులనూ, కార్యకర్తలనూ, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ దృష్టిలో పెట్టుకుని ఈ వుస్తకాన్ని రూపొందించాను. ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా అందరం భూతాప సమస్యతో తలపడాలని అభ్యర్థించడమే ఈ రచన ప్రధాన ఉద్దేశ్యం. చివరి అధ్యాయంలో ఈ విషయంలో మనం అనుసరించగల అంశాలను ప్రస్తావించాను.

Read More »

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను తీసుకువచ్చిన తీరు, బలవంతంగానైనా వాటిని అమలు చేయాలని చూడడం, వారితో శత్రుదేశంతో వ్యవహరించినట్లు నిరంకుశంగా వ్యవహరించడం చూస్తున్న వారికి ఆ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏదో పెద్ద విషయమే ఉన్నదనే అనుమానం రాకుండా ఉండదు. ఇప్పటికే దేశంలో వ్యవసాయరంగం పీకల్లోతు సంక్షోభంలో ఉన్న విషయం, ముఖ్యంగా పేద, సన్నకారు రైతులకు అది ప్రాణాంతకంగా మారిన విషయం అందరం స్వయంగా చూస్తున్నాం. ఢిల్లీలో నిరసనలు తెలిపే వారు కోరుతున్నది వ్యవసాయ రంగాన్ని ఇంతకంటే అధోగతి పాలు చేయవద్దని మాత్రమే.

Read More »

Bulletins

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)

ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.

Read More »

మానవ హక్కులు-2019 ( బులెటిన్-16)

ప్రజాస్వామ్య, లౌకిక విలువలకూ వ్యవస్థలకూ సమాధి కట్టి వాటి స్థానే హిందూత్వ ఆధిపత్య రాజకీయ సౌధాల నిర్మాణం దిగ్విజయంగా సాగుతున్న దుర్దినాలు ఒక వైపు కొనసాగుతుండగానే కొవిడ్‌-19 విరుచుకు పడి సమాజాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెట్టింది. కరోనాకు ఎటువంటి వివక్ష లేదని అనుకున్నా, అది మిగిలిన వారికంటే అణగారిన సమూహాలకు తలపెట్టిన హాని అంతాఇంతా కాదు. పేదల ఆరోగ్యాలనే కాక వారిని ఆర్థికంగా కూడా చావుదెబ్బ తీసింది. ప్రభుత్వాలకు పేదల పట్ల కించిత్తు బాధ్యత, బాధ కూడా లేదన్న విషయానికి వలస కార్మికుల హైవే యాత్రలే సాక్ష్యం చెప్పాయి. కరువు, సాంక్రమిక వ్యాధుల వంటి వైపరీత్యాలు మానవాళిని ఒక అత్యవసర పరిస్థితిలోకి (ఎమర్జెన్సీ) నెట్టేసే సందర్భాల్లో సైతం పెట్టుబడి ఎంత అనైతికంగా ప్రవర్తించగలదో కొవిడ్‌-19 తేటతెల్లం చేసింది.

Read More »

Books

వాకపల్లి: నేరము – శిక్ష

వాకపల్లి కేసులో నిందిత పోలీసులతో పాటు, వారి కంటే ఎక్కువగా కాకపోయినా వారితో సమానంగా అయినా, దర్యాప్తు సంస్థ కూడా విచారణకు గురైంది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా జడ్జి పోలీసులను నిర్దోషులుగా విడుదల చేశారు కానీ దర్యాప్తు జరిగిన పద్ధతి, దర్యాప్తు అధికారులు మాత్రం దోషులుగా నిలిచారు. సాధారణంగా కేసు దర్యాప్తులో జరిగిన లోపాల మీద స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరగదు. కాని లోపభూయిష్ట దర్యాప్తుపై తీర్పులు ఇచ్చే విధంగా న్యాయశాస్త్ర పరిధి ఇటీవలే విస్తరిస్తోంది. దర్యాప్తు లోపాల వల్ల పూర్తి న్యాయం పొందలేకపోయినా, పట్టు వదలకుండా 2007 నుండి ఈ కేసులో పోరాడినందుకు మహిళలకు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్పష్టంగా బయటకు అనకపోయినప్పటికీ, సెషన్స్‌ జడ్జి ఆ మహిళల సాక్ష్యాన్ని నమ్మినట్లు అర్థమవుతూనే ఉంది.

Read More »

కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా?

బాలగోపాల్‌ గారు ఈ ప్రసంగంలో వేదకాలం నుండి నేటి కాలం వరకు కులం, కులవ్యవస్థ, వర్నధర్మం ఎలా రూపు దిద్దుకుంటూ వచ్చాయో, మిగతా దేశాల్లో లేని వర్ణధర్మం మన దేశంలో మాత్రమే ఎందుకుందో విపులంగా చెప్పారు. కులానికి ఉత్పత్తి వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని వివరించారు. మార్క్సిజం చెప్పే చారిత్రక భౌతికవాదం ఒక్కటే కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాలను అర్థం చేసుకోవడానికి సరిపోదని అన్నారు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ మూడూ – కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం అనేవి ఇంత అతి రూపం, తీవ్రరూపం ఎందుకు తీసుకున్నాయో అర్థమవుతుందని చెప్పారు.

Read More »

Recent Posts

Scroll to Top