బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.