Latest Posts

Latest Posts, Reports (Telugu)

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక

అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన బస్తర్‌ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్‌ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)

మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్‌ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్‌ చీఫ్‌ జస్టిస్‌ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్‌ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

Fact Finding Reports (Telugu), Latest Posts

కౌలు రైతులకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత

రెండు కుటుంబాల వారు వ్యవసాయం కలిసిరాకపోవడానికి వాతావరణం అనుకూలించకపోవడంతోపాటు పెరిగిన పెట్టుబడులు, కల్తీ మందులని చెప్పారు. వారి కళ్ళకు అవే కనపడుతున్నాయి. వ్యవసాయం నడ్డి విరుస్తున్న ప్రభుత్వ విధానాలే ఈ స్థితికి ప్రధాన కారణం కాగా వ్వాటికి తోడుగా  వాతావరణ మార్పులు కూడా చేరి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రెండు సంఘటనలలోనూ మాకది స్పష్టంగా కనపడింది. కొత్త ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్యాకేజిని ప్రకటిస్తే వారు కొంతైనా అప్పుల బాధ నుండి బయటపడతారు. అలాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయంలో భరోసా ఇచ్చి అన్ని పధకాలకు అర్హత కలిపించాలి. వాతావరణ వైపరీత్యాలు జరిగినప్పుడు సమయానికి నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. యే ప్రభుత్వానికైనా ఇది కనీస బాధ్యతగా ఉండాలి.

Latest Posts, Reports (Telugu)

భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన

వాతావరణ సంక్షోభం విషయంలో ప్రాధమికమైన అవగాహన కోరుకునే యువకులనూ, కార్యకర్తలనూ, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ దృష్టిలో పెట్టుకుని ఈ వుస్తకాన్ని రూపొందించాను. ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా అందరం భూతాప సమస్యతో తలపడాలని అభ్యర్థించడమే ఈ రచన ప్రధాన ఉద్దేశ్యం. చివరి అధ్యాయంలో ఈ విషయంలో మనం అనుసరించగల అంశాలను ప్రస్తావించాను.

Books (Telugu), Latest Posts

కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా?

బాలగోపాల్‌ గారు ఈ ప్రసంగంలో వేదకాలం నుండి నేటి కాలం వరకు కులం, కులవ్యవస్థ, వర్నధర్మం ఎలా రూపు దిద్దుకుంటూ వచ్చాయో, మిగతా దేశాల్లో లేని వర్ణధర్మం మన దేశంలో మాత్రమే ఎందుకుందో విపులంగా చెప్పారు. కులానికి ఉత్పత్తి వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని వివరించారు. మార్క్సిజం చెప్పే చారిత్రక భౌతికవాదం ఒక్కటే కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాలను అర్థం చేసుకోవడానికి సరిపోదని అన్నారు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ మూడూ – కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం అనేవి ఇంత అతి రూపం, తీవ్రరూపం ఎందుకు తీసుకున్నాయో అర్థమవుతుందని చెప్పారు.

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)

ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.

Scroll to Top