Author name: Human Rights Forum

Press Statements (Telugu)

మేల్, ఫీమేల్ వరి వంగడాల పేరిట మోసం

మేల్, ఫీమేల్ వరి వంగడాల పేరిట మోసం నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ యాక్ట్ కింద కేసులునమోదు చేయాలి రైతులకు ఎకరాకు రూ. 80 […]

Press Statements (Telugu)

రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయాలి

నవంబర్ 26 న అమలాపురంలో జరిగే రాజ్యాంగం దినోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం మలికిపురం ఫూలే అంబేద్కర్ భవన్ లో మెహమ్మద్

Press Statements (Telugu)

ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని, నిరసిస్తున్న స్థానికుల పైన క్రిమినల్ కేసును నమోదు చేయడాన్ని హెచ్.ఆర్.ఎఫ్ ఖండిస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని నిరసిస్తూ, అదే రోజు పెద్ద హరివాణం గ్రామ ప్రజలు స్పందించి, హెచ్. ఆదినారాయణ

Books (Telugu)

రాజ్యాంగాన్ని ఎలా చూడాలి?

మన దేశంలో మెజారిటీ ప్రజలకు ఇప్పటికీ రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు. తెలిసిన కోర్టులు ఎక్కువసార్లు కులీన, సంపన్న వర్గాల ఆలోచనల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడున్న మంచి చట్టాలను రద్దు చేయడానికి శాసనకర్తలైనా వెనకాడుతున్నారేమో గాని కోర్టులు మాత్రం అడగకుండానే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ పనిని సులభతరం చేస్తున్నారని బాలగోపాల్ ఒక వ్యాసంలో ఘాటుగా విమర్శించారు కూడా. హిందుత్వవాదుల అసలు లక్ష్యం రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమానత్వ విలువల్ని రాజ్యాంగం నుండి తొలగించడమే. ఆ పనిని వెంటనే చేయకపోయినా, రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నపుడు రాజ్యాంగ సమీక్ష పేరుతో చేసి తీరతారు. అప్పటిదాకా అన్ని రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని రాజ్యాంగాన్ని కొద్దికొద్దిగా మారుస్తూ, అందులోని సమానతా విలువల్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తారు. ఈ రెండు చర్యలనూ అడ్డుకోవడానికి మనకు రాజ్యాంగం పట్ల సరైన అవగాహన ఉండడం అవసరం. ఈ వ్యాసాలు ఆ అవగాహనను ఇస్తాయని నమ్ముతున్నాం.

Press Statements (Telugu)

డేటా సెంటర్: సమాజానికి, పర్యావరణానికి విపత్తు

పోనీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రయోజనాలనేమన్నా ఒనగూరుస్తుందా అంటే అదీ లేదు. భారతదేశాన్ని ‘డిజిటల్ హబ్’గా మార్చే దిశలో ఒక అడుగుగా గూగుల్ దీనిని అభివర్ణిస్తున్నప్పటికీ, దీని నుంచి అది తీసే లాభాలు స్థానిక ప్రజలకు కాకుండా బహుళజాతి వాటాదారులకే చేరుకుంటాయన్నదే నిజం. ఈ ప్రాజెక్టు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వాస్తవానికి, డేటా సెంటర్లు అత్యంత ఆటోమేటెడ్ విధానాలతో పనిచేస్తాయి. ఒకసారి పూర్తిగా దాని నిర్వహణ మొదలుకాగానే అది సృష్టించే దీర్ఘకాల ఉద్యోగాలు కేవలం వందలలోనే ఉంటాయి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎక్కువగా బయటివారికే దక్కుతాయి. స్థానికులకు వచ్చే ఉద్యోగాలు తాత్కాలికమైనవి, పెద్దగా నైపుణ్యం లేనివి. సదుపాయాల నిర్మాణం, వాటి సాధారణ నిర్వహణ వంటి పనులకే అవి పరిమితం.

Press Statements (Telugu)

రియాజ్ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి

అక్టోబర్ 20, ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్

Scroll to Top