Author name: Human Rights Forum

Pamphlets

మన ఓటును ప్రజలనూ, ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యంగాన్నీ గౌరవించే పార్టీకే వేద్దాం

ఇన్ని దారుణాలకు కారణమైన పార్టీలన్నీ నేడు ఓట్లు అడగటానికి మళ్లీ మన ముందుకు రాబోతున్నాయి. మీరు ఎంత అవినీతికైనా పాల్పడండి కానీ, మాకు ఎలక్టోరల్‌ బాండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయల చందాలు మాత్రం ఇవ్వండి, మీ రక్షణ బాధ్యత మాది అని అవినీతిపరులకు అండగా నిలిచిన ప్రస్తుత ప్రభుత్వం బరితెగింపు సుప్రీంకోర్టు ఆపితే కానీ ఆగలేదు. మళ్ళీ నిస్సిగ్గుగా వారే అవినీతిపరుల భరతం పడతామని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లుగా మన బాధ్యత ఏమిటి? సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగల పార్టీని ఎన్నుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చాలామంది అనుకుంటుంటారు. కాని వారి ఆలోచనలు దుర్మార్గమైనవి అయినప్పుడు వాళ్ళు చేయగల హాని కూడా అదే మోతాదులో ఉంటుందని మరిచిపోకూడదు.

Pamphlets

ప్రతి మనిషికి ఒకే విలువ కోసం – 25 సంవత్సరాల హక్కుల కార్యాచరణ

తెలుగు రాష్ట్రాలలో యాభై సంవత్సరాలుగా సాగుతున్న హక్కుల ఉద్యమ ప్రస్థానంలో చిగురించిన విలువలను, అమరుల జ్ఞాపకాలను, విలువైన అనుభవాలను మూట కట్టుకొని అనేక కొత్త ఆశలతో, ఆలోచనలతో, సందిగ్ధ ప్రశ్నలతో 25 సంవత్సరాల క్రితం ఈ ప్రయాణం మొదలుపెట్టాం. హక్కుల దృక్పథం మీద జరిగిన సుదీర్ఘమైన, విలువైన చర్చల పర్యావసానంగా 1998లో HRF ఏర్పడింది. HRF ఒక విశాల దృక్పథంతో, స్వతంత్రంగా పనిచేసే హక్కుల సంస్థగా నిలబడి ఎదగడానికి వ్యవస్థాపక సభ్యులు వేసిన తాత్విక పునాదే కారణం. విలువల ఆధారంగా దగ్గరైన మనుషులు వాళ్ళు చేసే పని ద్వారా సమాజంలో హక్కుల సంస్కృతిని అభివృద్ధి చేస్తూ, వేళ్ళూనుకుని ఉన్న అనేక రకాల అసమానతలను, ఆధిపత్యాన్ని అణచివేతలను ఏదో ఓమేరకు తగ్గించే దిశగా కృషి చేయగలరని HRF ప్రయాణం గమనిస్తే అర్ధమౌతుంది. రాజ్యం, కులం, మతం, వర్గం, హిందుత్వ జెండర్‌, లైంగికత తదితర ఆధిపత్య వ్యవస్థల వలన అణచివేతకు గురౌతున్న అనేక ప్రజా సమూహాలకు HRF మద్దతుగా నిలబడింది.

Fact Finding Reports (Telugu)

రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడకండి

చెంగిచెర్ల సంఘటన హిందూత్వ రాజకీయాలకు ఒక ఉదాహరణ. ‘మందిర్ వహీ బనా దేంగే’ పాట హిందుత్వ పాప్ గా చలామణీలోకి తీసుకు వచ్చేసారు. అప్పుడయినా ఇప్పుడయినా హిందూత్వ విధానంలో మార్పు లేదు. ఒక వర్గాన్ని క్రూరులుగా చూపాలంటే, చరిత్రలో వారి పూర్వీకుల క్రూరత్వాన్ని మర్చిపోనివ్వకుండా చేస్తూ, జరిగిన చరిత్రకు కొంత మసాలా జోడించి ప్రజల్లో చరిత్ర పట్ల అవగాహనను మారుస్తూ, ఆ వర్గాన్ని రెచ్చగొట్టి, అదిగో రెచ్చిపోయారు, ఇలా క్రూరత్వం అనేది వీరి రక్తంలోనే ఉందని ఎదురు ప్రచారం చేస్తూ, ఈ క్రూరుల నుంచి నేనే నిన్ను కాపాడతాను కాబట్టి నాకే ఓటు వెయ్యండి అని అడగడమే ఆ విధానం. దశాబ్దాలుగా భారతదేశంలోని హిందువులకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టిన బాబ్రీ – అయోధ్య తగాదా తమకే అనుకూలంగా పరిష్కరించబడడంతో హిందుత్వవాదులు దాన్ని ఒక ఘనవిజయంగా చూస్తున్నారు, చూపిస్తున్నారు. నేను గెలిచాను అని చాటింపు వేసుకుంటూ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఈ అంశాన్ని వాడుకోవడానికి చూస్తున్నారు.

Fact Finding Reports (Telugu)

అప్పాయిపల్లి అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి

ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేసి ఉండవచ్చు. ఆ ప్రకటన రాగానే రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు కలిగి ఉన్న కుటుంబాలను వాళ్ల దగ్గర ఉన్న లావణి పట్టాలు వాపసు చేయమని ప్రకటన చేశారు. నిజానికి ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. దాని కంటే ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు.

Scroll to Top