Dalits

Press Statements (Telugu)

కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళను కులం పేరుతో దూషించి, చిత్ర హింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మను గ్రామ పెత్తందారు సత్యం గౌడ్ అండతో బీసీ కులస్థులు కులం పేరుతో దూషించి, ఆమెను దౌర్జన్యంగా ఈడ్చుకొని వెళ్లి, […]

Press Statements (Telugu)

దళితులు కొబ్బరికాయ కొడితే నేరమా..? శమ్నాపూర్ ఘటనపై గళమెత్తిన ప్రజాసంఘాలు

శమ్ననాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన అవమానంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. వినాయకుడి వద్ద అంజలి అనే ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం.. అక్కడ

Representations (Telugu)

గౌతోజి గూడ గ్రామంలో డప్పు లు కొట్టడాన్ని నిరాకరించిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చెసిన నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాల

శ్రీ యుత గౌరవ నీయులైన డైరెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదు గారికి… విషయం: మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతోజి గూడ

Press Statements (Telugu)

దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి

మనోహరాబాద్ మండలం గౌతోజి గూడ కు చెందిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు

Press Statements (Telugu)

దళిత మహిళ పై చిత్రహింసలకు పాల్పడ్డ ఎస్.ఐ పై కేసు నమోదు చేయాలి.

దళిత మహిళ కళావతిని చిత్రహింసలకు గురి చేసిన బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ పై క్రిమినల్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి. శుక్రవారం

Press Statements (Telugu)

వెంకటాయపాలెం శిరోముండనం తీర్పు నేరానికి తగిన శిక్షేనా?

“శిరోముండనం తీర్పు – నేరానికి తగిన శిక్షేనా?” సభ అమలాపురంలోని ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో దళిత ఐక్య పోరాట వేదిక, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో

Pamphlets

శిరోముండనం తీర్పు….. నేరానికి తగిన శిక్షేనా?

ఒకవైపు బలవంతులైన ముద్దాయిలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నానాటికీ మరింత శక్తివంతులు అవుతున్నారు. మొదట నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఉంటాడు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అధికార పార్టీకి, ప్రధాన ముద్దాయికి ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. కాబట్టి కేసు విచారణలో పురోగతిని అడ్డుకుంటున్నారు. మరోపక్క బాధితులు మాత్రం ప్రభుత్వ పథకాలు సైతం సక్రమంగా పొందలేని స్థితిలో కాలం వెళ్ళదీస్తున్నారు. అంతెందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టప్రకారం రావలసిన నష్టపరిహారం ఈనాటికీ వారికి అందనే లేదు. శిరోముండనంతో వారు తలవంపుల పాలయ్యింది ఒక ఎత్తయితే; ప్రభుత్వాలు, న్యాయస్థానాల వివక్షపూరితమైన తీరుతెన్నులతో జరిగిన అవమానం మరో ఎత్తు. అయినప్పటికీ చట్టాలంటే నమ్మకం సడలకుండా, న్యాయస్థానాల వైఖరి ఎడల విముఖత లేకుండా పట్టుదలతో నిలబడ్డారు. ఈ క్రమంలో ఆది నుంచి నేటికీ ఎన్నో పరీక్షలు, సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బాధితులు ఎస్సీలు కాదనే కొత్త వాదనని ముద్దాయిలు లేవనెత్తితే, తమను తాము దళితులుగా నిరూపించుకున్నారు.

Fact Finding Reports (Telugu)

రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండినా దళితులపై వివక్ష యథాతథం

దేశానికి స్వాతంత్రం వచ్చి, మనుషులందరూ సమానమే అనుకొని, అందుకు తగిన రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు గడిచినా సమాజంలో కుల వ్యవస్థ కారణంగా మనుషులందరూ అనేక సామాజిక వర్గాలుగా విభజింపబడి, ఇంకా ఒకరి పట్ల మరొకరు వివక్ష పాటిస్తూనే ఉన్నారు. దళితుల పట్ల అంటరానితనం ఇంకా సమసిపోకుండా కొనసాగుతూనే ఉన్నది. అందుకు తాజా సాక్ష్యమే ఈ సంఘటన. రాజ్యాంగం ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలను పెంచి పోషించుకుంటూ వస్తున్నాయి. ప్రజలకు తమ కులం పట్ల ఉండే వేర్పాటువాద భావాన్ని పెంచుకునే కుల సంఘాలను పోటీపడి ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా, ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు తగ్గటం కాకుండా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి.

Pamphlets

శిరోముండనం కేసులో నేరస్తుడే అభ్యర్థా?

శిక్షాకాలం కనీసం రెండు సంవత్సరాలు అయితే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అర్హత కోల్పోతారు. కానీ ఈ కేసులో గరిష్ట శిక్ష కాలం 18 నెలలు మాత్రమే కావడంతో చట్టపరంగా అతని అభ్యర్థిత్వానికి ఎటువంటి అడ్డంకి లేదు కానీ మన రాజకీయాలలో నైతికత, సిగ్గులేనితనం ఎంతవరకు దిగజారిపోయాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఆవేశంలో జరిగిన సాధారణ నేరం లాంటిది కాదు. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న కుల అధిపత్యం, అణిచివేత వికృత రూపంలో బయటపడ్డ ఒక సందర్భం. నేర తీవ్రతకు సరిపడగా శిక్షాకాలం లేదని బాధితులు, వారికి బాసటగా నిలబడ్డ సంఘాలు వాపోతుండగా మళ్లీ నేరస్తున్నే అభ్యర్థిగా నిలబెట్టడం రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమే. రాజకీయాల్లో నైతిక విలువలకు చోటు లేదని అందరికీ తెలుసు. అయితే ఈ దిగజారుడుతనాన్ని ఎక్కడో ఒకచోట అడ్డుకోకపోతే రాజ్యాంగ వ్యవస్థలే విచ్ఛిన్నమైపోతాయి. దానివల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలే!

Scroll to Top