Human Rights Forum

The essence of Human Rights is the notion of equality in Human Value and Worth – Balagopal

మానవ హక్కుల వేదిక

మనిషిని మనిషిగా చూడటం సమాజానికీ పాలకులకూ నేర్పించే పోరాటమే మానవ హక్కుల పోరాటం – బాలగోపాల్

Press Statements (Telugu)

సాహితీ సదస్సుపై దాడి అనాగరికం

ఎంతో బాధ్యత కలిగిన సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సదస్సుపై ఎన్నికల కోడ్ అమలు అంటూ, రామున్ని ధూషిస్తున్నారంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ భౌతిక దాడికి దిగటం అనాగరికమైన పద్ధతి. వారి ఆరోపణల్లో నిజమే ఉంటే భౌతికదాడికి దిగకుండా వారు చట్టాన్ని ఆశ్రయించాల్సి ఉండింది. మతోన్మాద ప్రేరేపిత విద్యార్థులు వారి రాజకీయ నాయకుల ఆదేశాలతో చేసిన ఈ మూక దాడి ఆధునిక సభ్య సమాజానికి సిగ్గు చేటు.
భౌతిక దాడికి గురైన సాహితీవేత్తలతో ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడి వారిలో ఆత్మ విశ్వాసం నింపాలనీ, రాష్ట్రంలో ఇటువంటి మూక దాడులు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల వేదిక కోరుతున్నది. భౌతిక దాడులకు దిగిన వ్యక్తులపైనా, వారిని పంపిన రాజకీయ నాయకులపైనా వెంటనే కేసులు నమోదు చేయించి, అరెస్టు చేయించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం.

Read More »

గంగవరం కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి

జూన్‌ 2023లో  జీపీఎస్‌ ఉద్యోగులు జీతాలు, ఉద్యోగాలు, హక్కులకోసం అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి  అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్‌ వారు విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వలేదు. దాని మీద వారంతా ఆందోళనకు దిగితే జిల్లా కలెక్టర్‌ సమక్షంలో అప్పట్లో ఒప్పందం కూడా జరిగింది. పదినెలలు గడిచినా ఒప్పందం అమలు కాకపోవడంతో తిరిగి కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మొత్తం గంగవరం గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడ్డారు. అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగులు కూడా వీరికి మద్దతుగా సమ్మె  బాట పట్టారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్య పక్షాన ఉండి పోరాటన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.

Read More »

Press Statements (English)

HRF Submission to Chief Election Commissioner urging door to door cash delivery of social security pensions in tribal areas

We would like to highlight a discrepancy in the circular regarding the eligibility criteria for AEPS (Aadhaar Enabled Payment System). The circular mentions that the transfer will be made to pensioners who are eligible for AEPS. This is confusing because to transfer cash, one needs to be eligible for ABPS (Aadhaar Based Payment System) and not AEPS. The AEPS is necessary for cash collection using Aadhaar and biometrics, whereas ABPS facilitates cash transfer into bank accounts. This discrepancy needs to be addressed urgently to ensure clarity and smooth implementation of the disbursement process.

Read More »

Reports

భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన

వాతావరణ సంక్షోభం విషయంలో ప్రాధమికమైన అవగాహన కోరుకునే యువకులనూ, కార్యకర్తలనూ, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ దృష్టిలో పెట్టుకుని ఈ వుస్తకాన్ని రూపొందించాను. ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా అందరం భూతాప సమస్యతో తలపడాలని అభ్యర్థించడమే ఈ రచన ప్రధాన ఉద్దేశ్యం. చివరి అధ్యాయంలో ఈ విషయంలో మనం అనుసరించగల అంశాలను ప్రస్తావించాను.

Read More »

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను తీసుకువచ్చిన తీరు, బలవంతంగానైనా వాటిని అమలు చేయాలని చూడడం, వారితో శత్రుదేశంతో వ్యవహరించినట్లు నిరంకుశంగా వ్యవహరించడం చూస్తున్న వారికి ఆ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏదో పెద్ద విషయమే ఉన్నదనే అనుమానం రాకుండా ఉండదు. ఇప్పటికే దేశంలో వ్యవసాయరంగం పీకల్లోతు సంక్షోభంలో ఉన్న విషయం, ముఖ్యంగా పేద, సన్నకారు రైతులకు అది ప్రాణాంతకంగా మారిన విషయం అందరం స్వయంగా చూస్తున్నాం. ఢిల్లీలో నిరసనలు తెలిపే వారు కోరుతున్నది వ్యవసాయ రంగాన్ని ఇంతకంటే అధోగతి పాలు చేయవద్దని మాత్రమే.

Read More »

Bulletins

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)

ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.

Read More »

మానవ హక్కులు-2019 ( బులెటిన్-16)

ప్రజాస్వామ్య, లౌకిక విలువలకూ వ్యవస్థలకూ సమాధి కట్టి వాటి స్థానే హిందూత్వ ఆధిపత్య రాజకీయ సౌధాల నిర్మాణం దిగ్విజయంగా సాగుతున్న దుర్దినాలు ఒక వైపు కొనసాగుతుండగానే కొవిడ్‌-19 విరుచుకు పడి సమాజాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెట్టింది. కరోనాకు ఎటువంటి వివక్ష లేదని అనుకున్నా, అది మిగిలిన వారికంటే అణగారిన సమూహాలకు తలపెట్టిన హాని అంతాఇంతా కాదు. పేదల ఆరోగ్యాలనే కాక వారిని ఆర్థికంగా కూడా చావుదెబ్బ తీసింది. ప్రభుత్వాలకు పేదల పట్ల కించిత్తు బాధ్యత, బాధ కూడా లేదన్న విషయానికి వలస కార్మికుల హైవే యాత్రలే సాక్ష్యం చెప్పాయి. కరువు, సాంక్రమిక వ్యాధుల వంటి వైపరీత్యాలు మానవాళిని ఒక అత్యవసర పరిస్థితిలోకి (ఎమర్జెన్సీ) నెట్టేసే సందర్భాల్లో సైతం పెట్టుబడి ఎంత అనైతికంగా ప్రవర్తించగలదో కొవిడ్‌-19 తేటతెల్లం చేసింది.

Read More »

Books

వాకపల్లి: నేరము – శిక్ష

వాకపల్లి కేసులో నిందిత పోలీసులతో పాటు, వారి కంటే ఎక్కువగా కాకపోయినా వారితో సమానంగా అయినా, దర్యాప్తు సంస్థ కూడా విచారణకు గురైంది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా జడ్జి పోలీసులను నిర్దోషులుగా విడుదల చేశారు కానీ దర్యాప్తు జరిగిన పద్ధతి, దర్యాప్తు అధికారులు మాత్రం దోషులుగా నిలిచారు. సాధారణంగా కేసు దర్యాప్తులో జరిగిన లోపాల మీద స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరగదు. కాని లోపభూయిష్ట దర్యాప్తుపై తీర్పులు ఇచ్చే విధంగా న్యాయశాస్త్ర పరిధి ఇటీవలే విస్తరిస్తోంది. దర్యాప్తు లోపాల వల్ల పూర్తి న్యాయం పొందలేకపోయినా, పట్టు వదలకుండా 2007 నుండి ఈ కేసులో పోరాడినందుకు మహిళలకు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్పష్టంగా బయటకు అనకపోయినప్పటికీ, సెషన్స్‌ జడ్జి ఆ మహిళల సాక్ష్యాన్ని నమ్మినట్లు అర్థమవుతూనే ఉంది.

Read More »

కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా?

బాలగోపాల్‌ గారు ఈ ప్రసంగంలో వేదకాలం నుండి నేటి కాలం వరకు కులం, కులవ్యవస్థ, వర్నధర్మం ఎలా రూపు దిద్దుకుంటూ వచ్చాయో, మిగతా దేశాల్లో లేని వర్ణధర్మం మన దేశంలో మాత్రమే ఎందుకుందో విపులంగా చెప్పారు. కులానికి ఉత్పత్తి వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని వివరించారు. మార్క్సిజం చెప్పే చారిత్రక భౌతికవాదం ఒక్కటే కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాలను అర్థం చేసుకోవడానికి సరిపోదని అన్నారు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ మూడూ – కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం అనేవి ఇంత అతి రూపం, తీవ్రరూపం ఎందుకు తీసుకున్నాయో అర్థమవుతుందని చెప్పారు.

Read More »

Recent Posts

Scroll to Top