అప్పాయిపల్లి అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి
ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేసి ఉండవచ్చు. ఆ ప్రకటన రాగానే రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు కలిగి ఉన్న కుటుంబాలను వాళ్ల దగ్గర ఉన్న లావణి పట్టాలు వాపసు చేయమని ప్రకటన చేశారు. నిజానికి ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. దాని కంటే ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు.