Latest Posts
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు
కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను తీసుకువచ్చిన తీరు, బలవంతంగానైనా వాటిని అమలు చేయాలని చూడడం, వారితో శత్రుదేశంతో వ్యవహరించినట్లు నిరంకుశంగా వ్యవహరించడం చూస్తున్న వారికి ఆ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏదో పెద్ద విషయమే ఉన్నదనే అనుమానం రాకుండా ఉండదు. ఇప్పటికే దేశంలో వ్యవసాయరంగం పీకల్లోతు సంక్షోభంలో ఉన్న విషయం, ముఖ్యంగా పేద, సన్నకారు రైతులకు అది ప్రాణాంతకంగా మారిన విషయం అందరం స్వయంగా చూస్తున్నాం. ఢిల్లీలో నిరసనలు తెలిపే వారు కోరుతున్నది వ్యవసాయ రంగాన్ని ఇంతకంటే అధోగతి పాలు చేయవద్దని మాత్రమే.
మానవ హక్కులు-2019 ( బులెటిన్-16)
ప్రజాస్వామ్య, లౌకిక విలువలకూ వ్యవస్థలకూ సమాధి కట్టి వాటి స్థానే హిందూత్వ ఆధిపత్య రాజకీయ సౌధాల నిర్మాణం దిగ్విజయంగా సాగుతున్న దుర్దినాలు ఒక వైపు కొనసాగుతుండగానే కొవిడ్-19 విరుచుకు పడి సమాజాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెట్టింది. కరోనాకు ఎటువంటి వివక్ష లేదని అనుకున్నా, అది మిగిలిన వారికంటే అణగారిన సమూహాలకు తలపెట్టిన హాని అంతాఇంతా కాదు. పేదల ఆరోగ్యాలనే కాక వారిని ఆర్థికంగా కూడా చావుదెబ్బ తీసింది. ప్రభుత్వాలకు పేదల పట్ల కించిత్తు బాధ్యత, బాధ కూడా లేదన్న విషయానికి వలస కార్మికుల హైవే యాత్రలే సాక్ష్యం చెప్పాయి. కరువు, సాంక్రమిక వ్యాధుల వంటి వైపరీత్యాలు మానవాళిని ఒక అత్యవసర పరిస్థితిలోకి (ఎమర్జెన్సీ) నెట్టేసే సందర్భాల్లో సైతం పెట్టుబడి ఎంత అనైతికంగా ప్రవర్తించగలదో కొవిడ్-19 తేటతెల్లం చేసింది.