నల్లగొండ జిల్లా కనగల్ మండలం (బుడుమర్లపల్లి) లోని అక్కనపల్లి వెంకటేశ్వరరావు మెమోరియల్ మోడల్ స్కూలు హాస్టలను మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీకి చెందిన ఐదుగురు సభ్యుల బృందం సందర్శించింది.
ఈ హాస్టల్ లో 100 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరికి సరిపడా వాటర్ మరియు గ్రీజర్ సదుపాయం లేదు. వీరికి ఉదయం ఇస్తున్న అల్పాహారము రెండు పుల్కాలు మాత్రమే. అవి వారికి సరిపడినట్టుగా లేవు. వాటి సంకెను పెంచాలని, వీటితోపాటు ఆడ పిల్లలు నివాసంగా ఉంటున్న హాస్టల్ కు ఉన్న ప్రహారి గోడకూడా ఎత్తుగా లేదు. అని మేము గుర్తించినాము. నైట్ వాచ్ మెన్ బలిష్టంగా ఉన్న, మధ్య వయసు గల మహిళను నియమించాలని కోరుతున్నాం. ఇదే రోజు MJPTBCWR School *నల్లగొండ టౌన్ రెడ్డి హాస్టల్ నందు నిర్వహిస్తున్న స్కూలు మరియు హాస్టల్ ను ఇదే బృందం పరిశీలించడం జరిగింది. ఇందు 9వ తరగతి 400, ఆరవ తరగతి 80 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఇచ్చట ప్రధానంగా చలికాలం రోజులలో స్నానం చేయడానికి గ్రీజర్ సదుపాయం లేదు, గ్రీజర్ లేక ఇబ్బంది గా ఉన్నారు. అదేవిధంగా చలికాలం వాడుకుంటున్న దుప్పట్లు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. పై సమస్యలతో చదువుకుంటున్న విద్యార్థులు బాధపడుతున్న మాట వాస్తవమే అని మా బృందం గుర్తించినది, కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం
పాల్గొన్న బృంద లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు అక్కనపెల్లి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి అద్దంకి దశరథ ,జిల్లా ఉపాధ్యక్షులు చింతమల్ల గురువయ్య ,సహాయ కార్యదర్శి చెట్టిపల్లి కాశిరాం ,మరియు కార్యవర్గ సభ్యులు ఎండి జరీనా పాల్గొన్నారు.
మానవ హక్కుల వేదిక,
ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ.
24-11-2024.