బదావత్ రాజు అక్రమ నిర్బంధాన్ని ఖండించండి

మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బదావత్ రాజును నిన్న అర్థరాత్రి (25-11-2024) పోలీసులు హనుమకొండ లోని కె. యు. సి. పోలీస్ స్టేషన్ కు పిలిపించి, అక్రమంగా నిర్భంధించటం పట్ల మానవ హక్కుల వేదిక తీవ్ర అ భ్యంతరం తెలుపుతుంది. బంజార హక్కుల పోరాట సమితి నిరసన కార్యక్రమం ప్రకటిస్తే, బదావత్ రాజు అదే సామాజిక వర్గానికి చెందినవాడు అయినందువల్ల ఆయనను ముందస్తుగా అదుపులో కి తీసుకున్నారు. మా సంస్థకు గానీ, బాదవత్ రాజు కు గానీ ఆ నిరసన కార్యక్రమంతో సంబంధమే లేదు. హక్కుల సంఘంలో రాష్ట్ర బాధ్యుడుగా ఉన్న బదావత్ రాజును పోలీసులు కేవలం సామాజికవర్గ పరంగా చూసి నిర్భంధించడం చట్ట వ్యతిరేకమే కాకుండా ఆయనపై అది అట్రాసిటీ అవుతుంది.

వాస్తవానికి ఎవరిని కూడా ఎక్కడో, ఎప్పుడో జరగబోయే ఒక ప్రజా నిరసనలో పాల్గొనకుండా ఇంటి దగ్గరే ముందస్తుగా నిర్బంధించటం అనేది అప్రజాస్వామికం, అన్యాయం. అసలు నిర్బంధ చట్టాలే ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవైతే, ఆ నిర్బంధ చట్టాలను కేవలం కొన్ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగిస్తామన్న పాలకులు ఇప్పుడిలా తుమ్మినా, దగ్గినా వారి రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల వ్యక్తిత్వాన్నీ, గౌరవాన్నీ భంగపరుస్తూ, అవమానిస్తూ పోలీస్ స్టేషన్లకు తరలించటం పౌరుల జీవించే హక్కుకు భంగకరమే అవుతుంది. కాబట్టి ఇకనుండైనా పాలకులు, పోలీసులు ముందస్తు అరెస్టుల విధానాన్ని మానుకోవాలని డిమాండు చేస్తున్నాం.

ఎస్. జీవన్ కుమార్  (ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)

డాక్టర్ ఎస్. తిరుపతయ్య (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 

ఆత్రం భుజంగరావు (రాష్ట్ర అధ్యక్షులు)

హైదారాబాద్,
26.11.2024.

Related Posts

Scroll to Top