ఆక్వా సేద్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలి

ఆక్వా సేద్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని అంతర్వేది దేవస్థానం గ్రామ ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేసాయి. గురువారం అంతర్వేది దేవస్థానం 16 స్తంభాల వద్దనుండి బైకు ర్యాలీ ప్రారంభమై బుంగా వారి గ్రూపు, సైకిల్ షాప్ సెంటర్ మీదుగా కేశవదాసు పాలెం సెంటర్ కు చేరుకుంది.

ఈ కార్యక్రమంలో అంతర్వేది దేవస్థానం గ్రామ సర్పంచ్ కొండా జాన్ బాబు మాట్లాడుతూ ఎన్జిటి తీర్పును అధికారులు తక్షణమే అమలు చేసి, తీర ప్రాంతాన్ని కాపాడాలని కోరారు. అధికారులు అలసత్వం వహిస్తే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు మాట్లాడుతూ CRZ పరిధిలో ఉన్న ఆక్వా చెరువులను తక్షణమే తొలగించాలని, 200 మీటర్ల నుండి 2000 మీటర్ల వరకు గల చెరువులను కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ చట్టం ప్రకారము అనుమతి లేని చెరువులను తొలగించాలని అన్నారు. ఎన్జిటి తీర్పును ప్రజాప్రతినిధి అమలయ్యే విధంగా కృషి చేసి పర్యావరణాన్ని కాపాడాలి అన్నారు. ఆక్వా సాగుపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని కోరారు.
సిపిఐ నాయకులు దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆక్వా సాగు వల్ల భూగర్భ జలాలు ఉప్పుమయం అయ్యాయని, కొబ్బరి,తాటి చెట్లు నాశనం అవుతున్నాయని, అధికార యంత్రాంగం కలగజేసుకుని తగు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో సమైక్య యూత్ అధ్యక్షులు చొప్పల మధు,బుంగ వరప్రసాద్, చింత కిరణ్, మోకా చిరంజీవి, మానవ హక్కుల వేదిక నాయకులు ముత్యాల శ్రీనివాసరావు, చెవ్వాకుల వెంకట్, రాజోలు నియోజవర్గ పరిరక్షణ చైతన్య సమితి అధ్యక్షులు, కార్యదర్శి నల్లి ప్రసాద్,మందా సత్యనారాయణ, గెడ్డం బాలరాజు, సిపిఐ నాయకులుదేవ రాజేంద్రప్రసాద్, ఫిషరీస్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా శ్రీను, అంతర్వేది నరసింహ స్వామి రైతు సంఘం అధ్యక్షులు బెల్లంకొండ సుబ్రమణ్యం,గొంది ఎంపిటిసి సభ్యులు కొల్లాబత్తుల నాని,సరేళ్ల విజయ్ ప్రసాద్, మాజీ సర్పంచ్తోట ప్రతాప్,నేతల నాని, తాడి సహాదేవ్, బీఎస్పీ నాయకులు ఆకుమర్తి భూషణం, మోకా శ్రీను, జనిపల్లి నాని, కొల్లా బత్తుల భాస్కర్ దితరులు పాల్గొన్నారు.

19.09.2024,
అమలాపురం.

Related Posts

Scroll to Top