Author name: Human Rights Forum

Fact Finding Reports (Telugu)

చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ విస్థాపితులకు న్యాయం చెయ్యాలి

రైల్వే స్టేషన్ విస్తరణ వల్ల ఆ ప్రాంతవాసులకు ఏర్పడుతున్న ఇబ్బందులు పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక అయిదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం భరత్ నగర్, మహలక్ష్మి నగర్ ప్రాంతాలలో(4/2/2024 నాడు) పర్యటించి ప్రజలతో మాట్లాడి వివరాలను సేకరించడం జరిగింది. మహాలక్ష్మీ నగర్ కాలనీ వాసుల తో అధికారులు సమావేశం జరిపి వాళ్ళు చేస్తున్న సూచనల గురించి ఆలోచించాలని, భరత్ నగర్ లో ఇండ్లు కొల్పో తున్న కుటుంబాలకు ఆ ప్రాంతం లోనే గృహాలు నిర్మించి ఇవ్వాలని వేదిక డిమాండ్ చేస్తుంది.

Representations (English)

HRF appeal to CM, Telangana to declare amnesty to the eligible prisoners in the Prisons of Telangana

We desire the government to release all Life Convicts who have completed 14 years of sentence including remission period, with no reference to the criminal sections. We request the Government to review the issue of the prisoners undergoing substantive sentence with sympathy and release them prematurely. Those who are sentenced under Cr.PC 302 and completed 7 years actual sentence and 3 years remission period be released.

Fact Finding Reports (Telugu)

NIMZ కోసం బలవంతపు భూసేకరణను నిలిపివేయాలి

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ  ప్రారంభించింది. ఈ మొత్తం భూమిలో 9 వేల ఎకరాల పట్టా భూమి పోను, దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్/ప్రభుత్వ  భూమి ఉంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా కాలంగా ఈ భూముల్లో  మెట్ట  పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ముందుగా దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సేకరించే ప్రయత్నం  చేసింది. పట్టా భూములకు ఇచ్చిన ధర కంటే  పేద రైతులు అభివృద్ధి చేసిన ఈ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లించారు.

Press Statements (Telugu)

ఇథనాల్ ఫ్యాక్టరీనీ తాత్కాలికంగా నిలిపివేసి, నిపుణుల కమిటీ వేసి అన్నీ అంశాలు పరిశీలించాలి

ఈ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం లో ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు వదలకూడదని, ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలని రెండు షరతులున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా, ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి. కాలుష్య నియంత్రణ మండలి కుమ్మకు తోనే ఇదంతా జరుగుతూ వుండాలి.

Books (Telugu)

వాకపల్లి: నేరము – శిక్ష

వాకపల్లి కేసులో నిందిత పోలీసులతో పాటు, వారి కంటే ఎక్కువగా కాకపోయినా వారితో సమానంగా అయినా, దర్యాప్తు సంస్థ కూడా విచారణకు గురైంది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా జడ్జి పోలీసులను నిర్దోషులుగా విడుదల చేశారు కానీ దర్యాప్తు జరిగిన పద్ధతి, దర్యాప్తు అధికారులు మాత్రం దోషులుగా నిలిచారు. సాధారణంగా కేసు దర్యాప్తులో జరిగిన లోపాల మీద స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరగదు. కాని లోపభూయిష్ట దర్యాప్తుపై తీర్పులు ఇచ్చే విధంగా న్యాయశాస్త్ర పరిధి ఇటీవలే విస్తరిస్తోంది. దర్యాప్తు లోపాల వల్ల పూర్తి న్యాయం పొందలేకపోయినా, పట్టు వదలకుండా 2007 నుండి ఈ కేసులో పోరాడినందుకు మహిళలకు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్పష్టంగా బయటకు అనకపోయినప్పటికీ, సెషన్స్‌ జడ్జి ఆ మహిళల సాక్ష్యాన్ని నమ్మినట్లు అర్థమవుతూనే ఉంది.

Scroll to Top