దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి

మనోహరాబాద్ మండలం గౌతోజి గూడ కు చెందిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల డిమాండ్ చేశాయి..గురువారం నాడు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ,మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రోహిత్,అంబేద్కర్ విద్యార్ధి సంఘం నాయకులు , హైకొర్టు న్యాయవాది దివాకర్, డిబిఎఫ్ నేతలు పులి కల్పన, దాసరి ఎగొండ స్వామి, దుబాషి సంజివ్, కాళ్ళకల్ నర్సింహ్మ ల బృందం గౌతోజి గూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యలు నర్సమ్మ,చందగరం,అర్జున్ ,నర్సింలు కలిసి వివరాలు తెలుసుకొని సాంఘిక బహిష్కరణ పై అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు.అనంతరం మనొహరాబాద్ పొలిస్ స్టేషన్ కు వెళ్ళి బాధితులు సాంఘిక బహిష్కరణ చెసిన వారి పై ఎస్సీ,ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్.ఐ కి పిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ గౌతొజి గూడకు చెందిన దళిత యువకులు చంద్రం, అర్జున్ లు ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కళలను నిజం చేస్తూ డప్పులుకొట్టె వెట్టిచాకిరి మేము చేయమని ఆత్మగౌరవంతో జీవిస్తున్న కుటుంబాన్ని మీరు డప్పు లు కొట్టకపొవడానికి నవాబుల, దొరాలా అంటూ కుల బహిష్కరణ చేయడం దారుణమన్నారు. అధునిక యుగంలో కుల కట్టుబటాట్లు అణిచివేత అవమానాలను ప్రశ్నించడమే దళిత కుటుంబం చేసిన నేరామా అని ప్రశ్నించారు. డప్పులు కొట్టడాన్ని నిరాకరించిన వీరి కుటుంబంతో మాట్లాడితే 25 చెప్పుదెబ్బలు, 5 వేల జురిమాన విధిస్తూ మాజీ సర్పంచ్ గ్రామ పెద్దల అధ్వర్యంలో హుకుం జారిచేసిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అందోళన చేస్తామని హెచ్చరించారు.

మీరు తప్పకుండా డప్పులు కొట్టాలే లేకుంటే మీ నాయనకు ఇచ్చిన మాన్యం భూమిని స్వాధీనం చెసుకుంటామని మీ అయ్యకు పూడితే మీరు డప్పు కొట్టాలే లేకుంటే వదిలేయ్యాలని జబర్దస్త్ చేస్తూ అవమానపర్చడం అగౌరపరిచారని బాధితులు చంద్రం, అర్జున్ లు అవెదన వ్యక్త పరిచారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ గ్రామస్తులు మిగితా దళిత కుటుంబాలను కుడా కుటుంబానికి వ్యతిరేకంగా తయారుచేసి నానా ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్య తీసుకొకుండా పొలిస్ యాంత్రాంగం కౌన్సిలింగ్ పేరుతో కాలయాపన చేస్తూ గత మూడు రొజులగా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. పట్టుబట్టి వెట్టిచాకిరి చేపియ్యడానకి కారణమైన ముదిరాజ్ కులస్తులను వారికి వంతపాడిన వారిని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

12.09.2024,
మనోహరాబాద్, మెదక్ .

Related Posts

Scroll to Top