జాతీయ ఉద్యమంలో వచ్చిన ఆశయాలు, లక్ష్యాల భావనలో భాగమే లౌకికవాదం, సామ్యవాదం

జాతీయ ఉద్యమంలో వచ్చిన ఆశయాలు, లక్ష్యాల భావనలో భాగమే లౌకికవాదం, సామ్యవాదం అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ అన్నారు.

మల్కిపురం పూలే అంబేద్కర్ భవన్లో రాజ్యాంగంపై మతశక్తుల దాడి- ప్రతిఘటన ఆవశ్యకతపై స్వేచ్ఛ స్వతంత్ర భావ ప్రకటన వేదిక కన్వీనర్ జనపల్లి సత్యానందం అధ్యక్షతన చర్చా వేదిక కార్యక్రమం జరిగింది. సామ్యవాదం,లౌకికవాదం పదాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కొట్టివేసినప్పటికీ ఆర్ఎస్ఎస్ నాయకులు వాటి గురించి మాట్లాడడం ప్రజల్లో గందరగోళం సృష్టించడమేనని హేతువాద సంఘం రాష్ట్ర పూర్వాధ్యక్షులు పెన్మత్స సుబ్బరాజు అన్నారు. రాజ్యాంగ పీఠికలో చేర్చిన అంశాలను ప్రజలందరూ సమిష్టి బాధ్యతగా రక్షించుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు భూసి జాన్ మూసే, పారా సంస్థ డైరెక్టర్ పల్లితానం, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మణరావు, నియోజకవర్గ అధ్యక్షులు ఆకుమర్తి భూషణం, నల్లి ప్రసాద్, మంద సత్యనారాయణ, బడుగు సాయిబాబా, పమ్మి రత్నరాజు, గొల్ల జెసురత్నం తదితరులు పాల్గొన్నారు.

ముత్యాల శ్రీనివాసరావు, 9553200201

13.07.2025,
మల్కిపురం.

Related Posts

Scroll to Top