మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల లో పిల్లలను మోకాళ్ళపై నిలబెట్టి శిక్షించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఈరోజు మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ మిర్యాలగూడ దగ్గర శ్రీనివాస్ నగర్ లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల లో పిల్లలను మోకాళ్ళపై నిలబెట్టి శిక్షించిన దాని గురించి నిజనిర్ధారణ చేయుటకై వెళ్లడం జరిగింది.

ఇక్కడ పిల్లలను మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం వాస్తవమేనని మా పరిశీలనలో తెలిసింది. ఆరోజు రాత్రి 9 గంటలకు మిగిలిన ఆహారాన్ని (చికెన్ బిర్యాని) తినుటకు కొంతమంది విద్యార్థినులు ప్రయత్నించిన వారిని ఎవరెవరు అని గుర్తించుటకు మొత్తం క్లాస్ విద్యార్థులను ఈ విధంగా శిక్షించడం జరిగిందని మా విచారణలో తేలింది . మరియు వంటగది అశుభ్రంగా మురుగుడు వాసన వెదజల్లుతూ ఉండడం కనిపించింది గురుకుల పాఠశాలలో 395 మంది విద్యార్థినిలకు ఉండవలసిన వంట సిబ్బంది లేరు. గతంలో కూడా ఈ గురుకుల పాఠశాలలో అవకతవకలు జరిగాయని దానిపై విజిలెన్స్ ఎంక్వయిరీ కూడా జరిగిందని మా దృష్టికి వచ్చింది. గతంలో కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పిల్లలకు సరైన ఆహారం ఉండటం లేదని మానవ హక్కుల వేదిక ద్వారా ఎన్నోసార్లు కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఈ సమస్య పరిష్కారం అవడం లేదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు శుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఆహారం అందించి నాణ్యమైన చదువులు చెప్పించి వారి అభివృద్ధికి దోహదపడాలని ఇలాంటి పొరపాట్లు జరగకుండా కారకులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉమ్మడి నల్గొండ జిల్లా మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది .

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు అక్కెనపల్లి వీరస్వామి, ఉపాధ్యక్షుడు చింతమల్ల గురూజీ, ప్రధాన కార్యదర్శి అద్దంకి దశరథ, సహాయ కార్యదర్శులు మహ్మద్ జరీన మరియు గడ్డం వెంకటరమణ లు పాల్గొన్నారు.

02-04-2026,
నల్గొండ.

Related Posts

Scroll to Top