ఈరోజు మానవహక్కుల అవగాహన – శిక్షణ తరగతులు నకిరేకల్ డిగ్రీ కళాశాల ఆవరణలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగినవి ఈ కార్యక్రమానికి మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య గారు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మానవహక్కుల వేదిక కార్యకర్తలకు హక్కులభావన – చరిత్ర అనే అంశం పై అవగాహన కల్పించారు. అదేవిదంగా మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు గోసుల మోహన్ గారు భారత రాజ్యాంగంలొ పౌరుల ప్రాథమిక హక్కుల గురించి అవగాహన కల్పిoచారు. ఆయన ఈ సందర్బంగా మానవహక్కుల కార్యకర్తలు సమాజంలో పౌరులకు వారి హక్కుల గురించి తెలియపరుస్తూ వారిని చైతన్య పరచాలని అన్నారు. మానవహక్కుల వేదిక ఆంధ్ర మరియు తెలంగాణ సమన్వయ కమిటీ నాయకులు జీవన్ కుమార్ గారు మానవహక్కుల ఉద్యమాలు మరియు సమగ్ర హక్కులు దృక్పధం అనే అంశం మీద హక్కుల కార్యకర్తలకు అవగాహన కల్పించారు. మానవ హక్కుల వేదిక నాయకులు జి. హరికృష్ణ గారు సమాజసేవ మరియు పౌరుల కర్తవ్యం అనే అంశం పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు అక్కెన పల్లి వీరస్వామి, నాయకులు జి. గురవయ్య, దశరధ, నంద్యాల హరిందర్ మధు లక్ష్మల్ల, గడ్డం వెంకటరమణ, నంద్యాల సులోచన, జరీనా, మురళీకృష్ణ, ఉదయ్, ch కాశీరాం,M శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్,
13-07-2025