ఆచంట మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వెలగన వెంకటస్వామి(75) ఈనెల ఆరవ తేదీన అత్యాచారానికి పాల్పడ్డ ఘటన తెలిసిందే. ఈ విషయమై మానవ హక్కుల వేదిక ముగ్గురు సభ్యుల బృందం ఏప్రిల్, 9 న బాలిక తల్లిదండ్రులను కలిసి నిజనిద్దారణ చేపట్టింది.
నిందితుని బంధువులు బెదిరింపులకు దిగి తమను వేధిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వేదిక సభలు వద్ద వాపోయారు. ఘటన జరిగి మూడు రోజులు అయినా ఇంత వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం పట్ల బాధితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ మధ్యకాలంలో ఉమ్మడి గోదావరి జిల్లాలలో మైనరు బాలికలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం. పోలీసులు చట్ట పరంగా సరైన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని వేదిక సభ్యులు ఆరోపింఛారు. ఈ ఘటనలో బాధితురాలికి చట్టపరంగా అందవలసిన పరిహారం ప్రభుత్వం వెంటనే అందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. బాధితురాలి కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా బలహీనమైనది. కావున వారికి అన్ని విధాల రక్షణ ప్రభుత్వం కల్పించాలని వేదిక డిమాండ్ చేస్తుంది.
ఈ నిజనిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇక్బాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆచంట,
09-04-2026.