పేదల పని హక్కును హరిస్తున్న విబి జీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి

12 కోట్ల పైగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, ఎటువంటి చర్చ చేపట్టకుండా పార్లమెంట్లో మౌఖిక ఓటు ద్వారా ఆమోదించిన వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్ అన్నారు. కొత్త పథకంలో 125 రోజుల పని హామీకి, నిరుద్యోగ భృతి కి చట్ట బద్ధత లేదు. అలాగే కొత్త పథకం దేశంలో అన్ని ప్రాంతాలకు వర్తించదు, కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు జి వి శ్రీ రాజ్ అన్నారు.వి బి జి రామ్ జి చట్టం పట్ల నిరసన తెలియజేస్తూ సోమవారం సఖినేటిపల్లి లాకుల వద్ద ఉపాధి కూలీ సంఘం సఖినేటిపల్లి మండల అధ్యక్షులు దొండపాటి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది . ఉపాధిని హక్కుగా కొనసాగించాలని, రాష్ట్రాలపై 40% నిధుల భారాన్ని మోపడం వల్ల రాష్ట్రాలు పథకాన్ని నిర్వీర్యం చేసి అవకాశం ఉందని దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజా మణి అన్నారు. డిమాండ్ ఆధారంగా నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. 60 రోజుల పని విరామం భూస్వాములకు అనుకూలంగా ఉంటుంది తప్ప, కార్మికులకు ఉపయోగపడదని, దానివల్ల కార్మికులు బేరమాడే శక్తి కోల్పోతారని అన్నారు.

అనంతరం లాక్ పేట నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ ఎండిఓ ఆఫీస్ వద్ద ఎ పి ఓ నాగ ప్రసాద్ గారికి వివిధ డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు.

  1. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వంద రోజులు పని దినాలు పూర్తి చేయాలి.
  2. వికసిత్ భారత్ జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి.
  3. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి.

ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, జనిపల్లి సత్యానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సరేళ్ల ప్రసన్నకుమార్, దేశినీడి భాస్కరరావు, తోటే ప్రతాప్, మత్స్యకార సంఘ నాయకులు చింత శ్రీనివాస్, ఉపాధి మేట్ సంఘం అధ్యక్షా కార్యదర్శులు చిట్టూరి నిర్మల కుమారి, చింతా హేమలత,
మెట్లు చవ్వాకుల బ్లేస్సి, లంకె తాతరాజు, చింత జీవరత్నం, సూరంపూడి రాజ్యలక్ష్మి, గేదే ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

– ముత్యాల శ్రీనివాసరావు
9553200201

16-02-2026,
సఖినేటిపల్లి.

Related Posts

Scroll to Top