రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయాలి

నవంబర్ 26 న అమలాపురంలో జరిగే రాజ్యాంగం దినోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

ఆదివారం మలికిపురం ఫూలే అంబేద్కర్ భవన్ లో మెహమ్మద్ షాబా మాస్టారి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాజ్యాంగం విలువలు, విశిష్టతల గురించి ప్రతి పౌరునికి తెలియాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగన్ని పరిరక్షించుకోకపోతే ప్రజాశ్వామ్య మనుగడకే ప్రమాదముందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కులవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. రవి, పిడిఎమ్ నాయకులు దీపాటి శివప్రసాద్, sc వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గెడ్డం ఫిలిప్ రాజు, తోటే ప్రతాప్, అంబేద్కర్ సంఘ నాయకులు విప్పర్తి సాయిబాబా, నల్లి ప్రసాద్, గొల్ల జేసురత్నం, మానవ హక్కుల వేదిక నాయకులు పమ్మి రత్నరాజు, రాచెల్ జ్యోతి,చుట్టుగుళ్ల నరసింహారావు, సిపిఎం నాయకులు చవ్వాకుల సూర్యప్రకాశరావు, చైతన్య సమితి నాయకులు మందా సత్యనారాయణ,టి.రాజు,వై.మణిరావు తదితరులు పాల్గొన్నారు.

అమలాపురం,
ముత్యాల శ్రీనివాసరావు.
9553200201

Related Posts

Scroll to Top