శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అంజయ్య ను కొట్టిన ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి

మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలిగౌరారం మండలం NG కొత్తపల్లి గ్రామస్తుడు రాపోలు అంజయ్య అలియాస్ అంజి తన తమ్ముడు పై జరిగిన దాడి గురుంచి ఫిర్యాదు చేయడానికి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కి వెళ్తే పిర్యాద్దారుణ్ణి పోలీసులు కొట్టిన విషయం గురించి నిజనిర్ధారణకు జరిపింది.

ముందుగా నకిరేకల్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అంజిని వివరాలు అడగగా నాకు మా బాబాయిలు ముగ్గురకు ఇంటి స్థలాల పంపకాల విషయంలో గొడవ జరుగుతున్నప్పుడు ముక్కామల గణేష్ అను అతను మా బాబాయిల తరఫున వచ్చి మా తమ్ముడిని రాయితో కొట్టగా తలకు రక్త గాయమై కింద పడిపోగా నేను అతని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా పోలీస్ వారు వచ్చి విచారణ జరిపినారని తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ ఎస్సై గారు మరియు కొంతమంది కానిస్టేబుల్స్ నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు అని చెప్పినాడు. తర్వాత బయటికి తీసుకొచ్చేటప్పుడు నడవలేని పరిస్థితులలో ఉన్న నన్ను ఎస్ఐ గారు వెనకాల నుంచి బూట్ కాలితో తన్ని, తన భార్యను కూడా అసభ్య పదజాలంతో బూతులు తిట్టాడు అని చెప్పినాడు.అదే రోజు సాయంత్రం మా ఊరు పెద్ద మనుషులు వస్తే వాళ్లతో ఏదో పొరపాటు జరిగింది మీకు న్యాయం చేస్తా అని చెప్పి నన్ను వెళ్ళిపొమ్మని చెప్పి పంపించినాడు. నడవలేని పరిస్థితులలో ఉన్న నన్ను నకిరేకల్ గవర్నమెంట్ హాస్పిటల్కు సాయంత్రం 8 గంటలకు మా వాళ్లు తీసుకొని పోయి అడ్మిట్ చేసినారు అని చెప్పినాడు. డాక్టర్ గారితో ఈ గాయాలు పోలీసు వాళ్ళు కొట్టడం వల్ల అయినవని చెప్పినాను అని అన్నాడు.

ఆరోజు డ్యూటీ డాక్టర్ గారిని వివరాలు అడగగా అంజి అనే అతనిని నడవలేని పరిస్థితిలో తీసుకువచ్చినారని గాయాలకు గల కారణాలు గొడవల్లో జరిగినవి అని చెప్పినారు అని డాక్టర్ వివరణ ఇచ్చారు. కానీ పేషెంట్ కేసు షీట్ పరిశీలన చేసినప్పుడు బాధితులు చెప్పిన వివరాలు చెప్పినట్లు అందులో లేకుండా దిద్దినట్లు తెలుస్తుంది. తర్వాత శాలిగౌరారం పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ ఎస్ఐ అందుబాటులో లేరు ఉన్న సిబ్బందిని వివరాలు అడగగా వారు ఇరు వర్గాల వారు గాయాలు అయ్యినట్లు ఇచ్చిన పిర్యాదు మేరకు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినామని చెప్పినారు.

ఏది ఏమైనా పోలీస్ స్టేషన్ కు పిర్యాదు చేయడానికి వచ్చిన అంజి పై అమానుషంగా ప్రవర్తించి నడవలేని పరిస్థితి తీసుకువచ్చినటువంటి ఎస్ఐ సైదులు మరియు అతనికి సహకరించిన పోలీస్ సిబ్బందిపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని, బాధితుడు పూర్తిగా కోలుకునేవరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని అతనికి నష్ట పరిహారం ఇవ్వాలని మానవ హక్కుల వేదిక నల్గొండ జిల్లా కమిటీ సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కోరుచున్నాము.

ఇట్టి నిజానిర్దారణలో మానవ హక్కుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షలు అక్కెనపల్లి వీరస్వామి, అద్దంకి దశరద, గడ్డం వెంకటరమణ, బల్లెం ఉదయ్ కుమార్ లు పాల్గొన్నారు.

శాలిగౌరారం,
12-04-2025.

Related Posts

Scroll to Top