గాజులరామారంలో పేదల ఇళ్ల కూల్చివేత – HYDRA చర్యలు గర్హనీయం
గాజులరామారంలోని గడ్డిపోచమ్మ, బాలయ్య, రాజ రాజేంద్ర మరియు అబిద్ బస్తీలలో సెప్టెంబర్ 21వ తేదీన మొత్తం 275 ఇళ్లను రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారనే కారణంతో […]
గాజులరామారంలోని గడ్డిపోచమ్మ, బాలయ్య, రాజ రాజేంద్ర మరియు అబిద్ బస్తీలలో సెప్టెంబర్ 21వ తేదీన మొత్తం 275 ఇళ్లను రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారనే కారణంతో […]
విజయనగరం జిల్లా, ఎస్ కోట మండలంలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం లిమిటెడ్ (JSWAL)కు 2007లో జూన్ 28న (జీఓ నెం. 892 కింద) కేటాయించిన 1166
విద్యా నగర్, శివమ్ రోడ్ లో గత కొన్ని దశాబ్దాలుగా బైటకమ్మరి అనబడే సంచార జాతికి చెందిన దాదాపు పది కుటుంబాలు గృహనిర్మాణానికి అవసరం అయిన గునపాలు,
24.09.2024 To, Shri.A. Revanth Reddy Garu, Chief Minister, State of Telangana. Sir, The HUMAN RIGHTS FORUM, is a non- political,
కుత్బుల్లాపూర్ మండలం చింతల్ చెరువుని ఆనుకొని ఉన్న దేవేంద్రనగర్ ఎల్లమ్మ బస్తీలో ‘హైడ్రా’ అధికారులు పోలీసుల సహాయంతో ఆగస్టు 6, 2024 పొద్దున 50 కి పైగా
జూన్ 2023లో జీపీఎస్ ఉద్యోగులు జీతాలు, ఉద్యోగాలు, హక్కులకోసం అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ వారు విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వలేదు. దాని మీద వారంతా ఆందోళనకు దిగితే జిల్లా కలెక్టర్ సమక్షంలో అప్పట్లో ఒప్పందం కూడా జరిగింది. పదినెలలు గడిచినా ఒప్పందం అమలు కాకపోవడంతో తిరిగి కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మొత్తం గంగవరం గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడ్డారు. అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కూడా వీరికి మద్దతుగా సమ్మె బాట పట్టారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్య పక్షాన ఉండి పోరాటన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.
ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేసి ఉండవచ్చు. ఆ ప్రకటన రాగానే రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములు కలిగి ఉన్న కుటుంబాలను వాళ్ల దగ్గర ఉన్న లావణి పట్టాలు వాపసు చేయమని ప్రకటన చేశారు. నిజానికి ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. దాని కంటే ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు.
రైల్వే స్టేషన్ విస్తరణ వల్ల ఆ ప్రాంతవాసులకు ఏర్పడుతున్న ఇబ్బందులు పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక అయిదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం భరత్ నగర్, మహలక్ష్మి నగర్ ప్రాంతాలలో(4/2/2024 నాడు) పర్యటించి ప్రజలతో మాట్లాడి వివరాలను సేకరించడం జరిగింది. మహాలక్ష్మీ నగర్ కాలనీ వాసుల తో అధికారులు సమావేశం జరిపి వాళ్ళు చేస్తున్న సూచనల గురించి ఆలోచించాలని, భరత్ నగర్ లో ఇండ్లు కొల్పో తున్న కుటుంబాలకు ఆ ప్రాంతం లోనే గృహాలు నిర్మించి ఇవ్వాలని వేదిక డిమాండ్ చేస్తుంది.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మొత్తం భూమిలో 9 వేల ఎకరాల పట్టా భూమి పోను, దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్/ప్రభుత్వ భూమి ఉంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా కాలంగా ఈ భూముల్లో మెట్ట పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ముందుగా దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సేకరించే ప్రయత్నం చేసింది. పట్టా భూములకు ఇచ్చిన ధర కంటే పేద రైతులు అభివృద్ధి చేసిన ఈ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లించారు.