ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించకుండా జీవనోపాధిని దెబ్బతీయడం అన్యాయం

విద్యా నగర్, శివమ్ రోడ్ లో గత కొన్ని దశాబ్దాలుగా బైటకమ్మరి అనబడే సంచార జాతికి చెందిన దాదాపు పది కుటుంబాలు గృహనిర్మాణానికి అవసరం అయిన గునపాలు, పారలు వంటివి అమ్ముతూ, వాటిని రిపేర్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాయి. వీరందరూ ఎక్కువగా బ్యాంకు అఫ్ బరోడా కి ఎదురుగా ఉన్న ఫ్యూట్పాత్ మీద తమ కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఆ ఫుట్ పాత్ చివరన ఒక నాలా ప్రవహిస్తున్నది. ఆ నాలా లో ప్రజలు చెత్త పారేయకుండా మరియు నాలా రక్షణ కోసం అన్నట్టు నాలా దగ్గర ఎత్తైన కంచె వేశారు. ఫుట్ పాత్ మీద వ్యాపారం చేసుకునే ఈ కుటుంబాలను నవంబర్ 28, 2024 రోజున బలవంతగా ఖాళీ చేయించి, ఫుట్ పాత్ మీద మనుష్యులు నడవడానికి కూడా వీలు లేకుండా కంచెను నాలా మీద ఫుట్ పాత్ మీద వేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొర్పొరేషన్ వారికి ఫుట్ పాత్ మీద మీద కంచె వేయాలి అన్న ఆలోచన రావడం గమనించతగినది.

ఈ కుటుంబాల వల్ల, ఇప్పటి దాకా ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయినా సరే వారిని ఖాళీ చేయించారు. అది కూడా ప్రత్యామ్న్యాయ స్థలం చూపించకుండా. ఈ విషయం మీద 29 డిసెంబర్ 2024 రోజున మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు, ఎక్స్క్యూటివ్ మెంబెర్ రోహిత్ చంద్ర, ప్రధాన కార్యదర్శి సంజీవ్ నిజనిర్ధారణ చేపట్టి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

బాధితులకు స్ట్రీట్ వెన్డింగ్ కార్డులు ఇప్పించి వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలని, అదే విధంగా అసలు ఫుట్ పాత్ కి కంచె ఎందుకు వేసారో విచారణ జరిపించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి లేఖ రాసాము.

Related Posts

Scroll to Top