Environmental Issues

Press Statements (Telugu)

ప్రకృతి వైపరీత్యాల నివారణకు తగిన వ్యవస్థను బలోపేతం చేయాలి

ఆగస్టు చివరి వారంలో రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. కొన్ని పదుల మంది మనుషులు చనిపోయారు. 117 గ్రామాలు వరదల […]

Press Statements (Telugu), Uncategorized

ఓర్వకల్లు మండలంలోని మూడు క్వార్ట్జ్ గనులకు పర్యావరణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి

ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental

Press Statements (Telugu)

ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(SEZ) లోని ‘ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ లో 21 ఆగస్టు 2024న భారీ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం, ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్ప కూలిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన వెలువడింది. గాయపడిన వారిసంఖ్య 36 అని వార్తలు. అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు అని వార్తలు సూచిస్తుండగా, ఫ్లోర్ లో జరిగిన సాల్వెంట్ లీకేజీ వల్ల జరిగిందని ప్రభుత్వ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని సాక్ష్యాత్తూ హోం మినిస్టరే చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారులకు తెలియరాలేదట. బహుశా ప్రజలు, పత్రికలవాళ్ళూ మరచిపోయినంత వరకూ ఈ విషయం వారి పరిశీలనలోనే ఉంటుందేమో.

Press Statements (Telugu)

ఇథనాల్ ఫ్యాక్టరీ కాలుష్యాన్ని ప్రశ్నించిన చిత్తనూర్ గ్రామస్తులపై పోలీసు దాడులను ఖండించండి

ఈ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం లో ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు వదలకూడదని, ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలని రెండు షరతులున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా, ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి. కాలుష్య నియంత్రణ మండలి కుమ్మకు తోనే ఇదంతా జరుగుతూ వుండాలి.

Our Writers

ప్రకృతి వైపరీత్యం అంటే అగ్ని ప్రమాదాలు మాత్రమే కాదు – సంజీవ్ (ఆంధ్రజ్యోతి , 10.08.2023)

జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రీయ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు వెంటనే స్పందించే విధంగా నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు స్టేట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు

Fact Finding Reports (Telugu)

అధికార బలంతో చేపట్టిన అక్రమ ఆక్వా చెరువుల తవ్వకం ఆపాలి

ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకల్లు గ్రామం దళితవాడనానుకుని ఉన్న పంట భూములలో ఆక్వా చెరువుల తవ్వకం విషయమై, ఈ రోజు ఇద్దరు సభ్యుల మానవ హక్కుల

Latest Posts, Reports (Telugu)

భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన

వాతావరణ సంక్షోభం విషయంలో ప్రాధమికమైన అవగాహన కోరుకునే యువకులనూ, కార్యకర్తలనూ, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ దృష్టిలో పెట్టుకుని ఈ వుస్తకాన్ని రూపొందించాను. ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా అందరం భూతాప సమస్యతో తలపడాలని అభ్యర్థించడమే ఈ రచన ప్రధాన ఉద్దేశ్యం. చివరి అధ్యాయంలో ఈ విషయంలో మనం అనుసరించగల అంశాలను ప్రస్తావించాను.

Scroll to Top