కరకగూడెం మండలంలో ఆరుగురు మావోయిస్టులను కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో 5-9-2024 తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను (అందరూ ఆదివాసులే) కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మానవహక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. ఆ సంఘటనకు సంబంధించి సి.బి.ఐ చేత కాని, తెలంగాణా రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత కాని నేర పరిశోధన జరిపించాలని HRF కోరుతోంది.