దళిత మహిళ కళావతిని చిత్రహింసలకు గురి చేసిన బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ పై క్రిమినల్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి.
శుక్రవారం నాడు డిబిఎఫ్, మానవ హక్కుల వేదిక బృందం వికారాబాద్ జిల్లా, నవల్గ గ్రామంలో దళిత మహిళ కళావతిని కలిసి పొలీసులు చిత్రహింసలకు గురి చేసిన విషయం మీద వివరాలు సేకరించారు. తాండూర్ డిఎస్పి బాలకృష్ణ రెడ్డిని కలిసి ఎస్.ఐ పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కోరాము. గత మూడు నెలలుగా పొలీసు స్టేషను చుట్టు తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అత్యంత హేయమైన చర్య. కళావతిని విచారించే సమయంలో మహిళ పొలీసులు లేకుండా విచారణ చేసి చట్టాన్ని ఉల్లంఘించారు. దాహం వెసి నీళ్ళు అడిగితే మూత్రం తాగు అని అవమానించడం సిగ్గుచేటు. ఈ సంఘటన పై మహిళ కమిషన్ కు, జాతీయ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ల కు పిర్యాదు చేస్తాం. ఎస్.ఐ పై కేసు నమోదు చెసే వరకు పోరాడుతాం, బాధితురాలుకి అండగా ఉంటాం.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ నాయకులు శంకర్ , కల్పన, నవిన్, ఈశ్వర్, మానవ హక్కుల వేదిక నాయకుల రోహిత్, సైంటిపిక్ స్టూడెంట్ పెడెరెషన్ రాష్ట్ర అధ్యక్షుడు జిడి స్పార్టకస్ లు పాల్గొన్నారు.
17.08.2024,
బషీరాబాద్.