ఫిబ్రవరిలో మొగల్తూరులో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన ఘటనలో తిరుమాని రాజేంద్ర, తిరుమాని దుర్గాప్రసాద్ అనే నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. జుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులు భీమవరం పోక్సో కోర్టు లో బెయిల్ వేసుకొని బెయిల్ పొంది బయటకు వచ్చారు.
అయితే ప్రత్యేక చట్టమైన పోక్సో నియమాలను అనుసరించి బాధితులకు బెయిల్ పిటిషన్ విషయమై సమాచారం అందించాలి. కానీ ఈ కేసులలో పోలీసు విచారణ అధికారి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. బాధితులకు నోటీసు అందిందా లేదా అన్న విషయం (ఏపీపీ) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నిర్ధారించుకోలేదు. పోక్సో చట్ట నియమ నిబంధనలను పాటించకుండా ఈ రకంగా పొందిన బెయిలును గతంలో అనేక హైకోర్టులు రద్దు చేసాయి. విచారణ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల బాధితులు బెయిల్ సమయంలో న్యాయస్థానాల్లో తమ ఆందోళన తెలియజేసుకునే అవకాశం కోల్పోతున్నారు. నిందితులు త్వరితగతిన బెయిల్ పొంది తమ ముందే తిరగడంతో బాధితులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తం చట్టబద్ధ వ్యవస్థల పని తీరు మీదే నమ్మకం సన్నగిల్లుతోంది.
మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ రెండు కేసులలో పోలీసులు, ప్రాసిక్యూషన్ న్యాయవాది తక్షణమే బెయిల్ రద్దుకు పిటిషన్ వేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ వేస్తోంది.
వై రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మహమ్మద్ ఇక్బాల్, అధ్యక్షులు, ఉమ్మడి గోదావరి జిల్లా
పి. పవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
నర్సాపురం,
25-04-2026.