జీవో నెంబర్ 49 తక్షణమే రద్దు చేయాలి

ప్రజాభిషానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 49 తక్షణమే రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సుజాయిత్ ఖాన్ డిమాండ్ చేసారు .

ఈ సందర్భంగా 49 జీవో రద్దు కోసం కేరమేరి మండలంలో సోమవారం రోజున పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివాసుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలన్నారు పులుల సంరక్షణ పేరుతో కొమరం భీం జిల్లాలో ఆదివాసులను అడవి నుంచి గెంటివేసి అడవిలను కార్పోరేట్ కంపెనీలకు కట్టపట్టేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నయని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తడోబా అందరి రిజర్వు ఫారెస్ట్ ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో కలుపుతూ కొమరం భీమ్ కాగజ్నగర్, అసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను పేరుకొంటూ తీసుకువచ్చిన ఆ నెంబర్ 49 వెంటనే రద్దు చేయాలని తెలిపారు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రాంతం భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో ఉందని అన్నారు అసిఫాబాద్ జిల్లాలో గ్రామసభ పెస లాంటి గిరిజన చట్టాలను అమలు పరచకుండా ఈ గ్రామాలలో ఎలాంటి సభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా జీవో నం.49 తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోవా విజయ్, బిజెపి మండల అధ్యక్షులు చెడమకి తుకారం, పెస కోఆర్డినేటర్ భరత్ భూషణ్, ఆదివాసి నాయకులు బొజ్జి రావు, గ్రామ పటేలు తదితరులు పాల్గొన్నారు.

కేరమేరి,
14.7.2025.

Related Posts

Scroll to Top