శ్రీ యుత గౌరవ నీయులైన డైరెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదు గారికి…
విషయం: మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతోజి గూడ గ్రామంలో ఉన్నత చదువులు చదువుకొని ప్రవెట్ ఉద్యోగాలు చేస్తూ ఆత్మ గౌరవం తో జీవిస్తు డప్పు లు కొట్టడాన్ని నిరాకరించిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చెసిన నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ….
వివరణ: మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతోజి గూడ గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ పంచమి శంకరయ్య,నర్సవ్వ దంపతుల కూమారులు చంద్రం,అర్జున్ లు ఉన్నత చదువులు చదువు కొని ప్రవెట్ సాప్ట్ వెర్ ఉద్యోగాలు చెస్తున్నారు. దీంతో చావులు సందాలకు పెళ్ళి పెరంటాలకు డప్పులు కొట్టడం వల్ల మేము ఉద్యోగాలు చెసుకొలెక పొతున్నామని, స్వయం కృషి తో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన విద్య హక్కుతో ఉన్నత చదువులు చదవి ఉద్యోగాలు చెస్తు ఆత్మగౌరవం తో జీవిస్తున్నారు. ఇది జీర్ణించుకొలెని గ్రామంలో ని పెత్తందారు లైన ముదిరాజ్,పద్మశాలి కులానికి చెందిన అధిపత్య వాదులైన గ్రామ పెద్ద మనుషుల ముసుగులో పద్మశాలి కులానికి చెందిన మాజీ సర్పంచ్ బొడ్డు వెంకటెశం, ముదిరాజ్ పొగాకు సత్యనారాయణ, ముదిరాజ్ పొగాకు నర్సిములు, ముదిరాజ్ తలారి నర్సింలు,రెణు కుమార్ (మాజీ ఉపసర్పంచ్ ఎస్సీ ,మాదిగ) తదితరులు 10-9-24 నాడు ఉదయం గ్రామ గాంధీ విగ్రహం వద్దకు ఎస్సీ యువకులైన పంచం చంద్రం, పంచమి అర్జున్ వారి తల్లి నర్సమ్మ లను పిలిపించి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నంతా మాత్రాన మీరు నవాబులా..పటెండాళ్ళ .మి అయ్యా పేరుతో బతుకుతున్న మీరు డప్పు కొట్టాలిసినదే కుల వృత్తి చేయాలని బెదిరింపులకు పాల్పడి ఒత్తిడి చేయగా దళిత యువకులు తిరస్కరించారు. దీంతో గ్రామ పెద్దల ముసుగులో దళిత కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు. శంకరయ్య కుటుంబం తో ఎవ్వరు మాట్లాడిన 5 వేల జరిమానా, చెప్పు దెబ్బలు తినాల్సివస్తదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అంక్షలు విధించారు. మన్యాల కింద వచ్చిన భూమి ని స్వాధీనం చెసుకుంటామని,చెరువు తదితర గ్రామ ఉమ్మడి అదాయ వనరులలో పాలు వాటాలు ఇవ్బమని బెదిరించి దళిత కుటుంబాన్ని అవమానపర్చారు.ఈ అవమానం పై బాదిత యువకుడు అర్జున్ ట్విట్టర్ ద్వారా జిల్లా ఎస్.పి,కలెక్టర్ లకు పిర్యాదు చేసారు. పై అధికారులు అదేశాలతో గ్రామానికి ఈ నెల 11 న మధ్యాహ్నం వచ్చిన తహసీల్దారు సి.ఐ,ఎస్.ఐ లు కౌన్సిలింగ్ పేరుతో కాలయాపన చేశారు. 11 నాడు పొలీస్ స్టేషను లో పిర్యాదు చెయడానికి బయలుదేరి న బాధితులను కౌన్సిలింగ్ కు రమ్మని చెప్పి ఎస్.ఐ పిర్యాదు తీసుకొలెదు.
ఈ సంఘటన సమాచారం అందుకున్న డిబిఎఫ్, మానవ హక్కుల వేదిక,అంబేద్కర్ విద్యార్థి సంఘం కార్యకర్తల బృందం గ్రామానికి వెళ్ళి సంఘటన వివరాలు తెలుసుకొని గ్రామంలో ని అంబేద్కర్ విగ్రహం వద్ద,పొలీస్ స్టేషను ముందు నిరసన వ్యక్తం చేయడంతో తలొగ్గి ఎట్టకేలకు పిర్యాదు తీసుకొని నిందితుల పై మనొహరబాద్ పోలీసులు మూడు రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చెశారు.(Fir no 239/24,Date 12-9-24, Manoharbad ps).కావాలనే నిర్లక్ష్యం తో bns కింద క్రిమినల్ సెక్షన్ లు నమోదు చెయలేదు. నిందితుల పై Bns కింద సైతం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కొరుతున్నాం.బాధిత దళిత కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కొరుతున్నాం.
జై భీమ్
పంచమి చంద్రం
S/ late శంకరయ్య
గ్రామం గౌతొజి గూడ,మండలం :మనొహరబాద్, మెదక్ జిల్లా
పి.శంకర్
డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి
9441131181
పులి కల్పన
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,
దాసరి ఎగొండ స్వామి
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
దుబాషి సంజివ్
డిబిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు
రోహిత్,
మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు .
రోహిత్ చంద్ర ,
మానవ హక్కుల వేదిక .
Copy to
చైర్మన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ గారికి.
జిల్లా కలెక్టర్, మెదక్ జిల్లా గారికి.
ఎస్.పి మెదక్ జిల్లా గారికి..