గుర్రం పల్లి దళితుల పై దాడి చేసిన నిందితుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలనిదళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్), మానవ హక్కుల వేదిక సంఘాలు నిజనిర్దారణ బృందం డిమాండ్ చేసింది. శుక్రవారం నాడు దళిత బహుజన ఫ్రంట్, మానవ హక్కుల వేదిక సంఘాలు గుర్రం పల్లి లో బాధితులను కలిసి నిజనిర్దారణ చేసారు.
ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రోహిత్, జిల్లా (హెచ్ అర్ ఎఫ్ ) మానవ హక్కుల వేదిక నాయకులు జంగయ్య , పాండు ,లు మాట్లాడుతూ ఇటివల గ్రామంలో జరిగిన బొండ్రాయి ఉత్సవాలలో దళితేతర యువకులు డ్యాన్స్ చెస్తు ఆడ పిల్లలపై పడబొతుంటే అడ్డుకున్న దళిత యువకుడు ప్రవిణ్ అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. మరుసటి రోజు గ్రామ పంచాయతి వద్ద పొన్ మాట్లాడుతుండగా రజనికాంత్,నవిన్ రెడ్డి, దేవెందర్ గౌడ్ ,హరి ,సందిప్ లు బండ రాయితో దాడి చెస్తుండగా అడ్డుకొని పొయిన ప్రవిణ్ తమ్ముడు శ్రీనివాస్ పై బండ రాయి,బండి తో దాడి చేసి చెయి విరగొట్టి హత్యయత్నం చేశారన్నారు. ఈ సంఘటన పై చౌదరిగూడెం పోలీసులకు పిర్యాదు చేసిన నిందితుల పై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రన్నారు.నిందితుల పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.
దళితులకు రక్షణ కల్పించాలన్నారు.పొలీసులు నిర్లక్ష్యం విడనాడకపొతే ఆందోళన తప్పదన్నారు. గతంలో దుర్గ మాత ఉత్సవాలలో సైతం దాడి జరిగిందన్నారు.ఎస్సీ ల భూములను సైతం అక్రమిస్తున్నారన్నారు. ఈ ఘటన ల పై అట్రాసిటి కేసులు అయినప్పటికి నిందితులను అరెస్డు చెయలేదన్నారు.ఈ కార్యక్రమం లో దళిత నాయకులు యాదయ్య,రాంచంద్రం, ప్రసాద్, బాధితులు ప్రవిణ్,శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
రంగారెడ్డి ,
07-06-2025.