హైదరాబాద్ , కాప్రా ప్రాంతా నికి చెందిన దళిత మహిళ,మావోయిస్టు పార్టీ సభ్యురాలు పల్లెపాటి రాధ ను ఇన్ఫార్మర్ అన్న ఆరోపణ తో, మావోయిస్టు పార్టీ శ్రేణులు హత్య చేయడం మమ్మల్ని దిగ్భ్రాంతి కి గురిచేసింది.
ఇది మానవీయత కొరవడిన చర్యగా గర్హిస్తూ, ఈ సంఘటనను ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సంస్థలు తీవ్రంగా ఖండిస్తుంన్నాయి.
ఆరెళ్ల క్రితం ఇంట్లోనుండి వెళ్లి పోయి మావోయిస్టు పార్టీ లో చేరిందని,గత కొంత కాలం క్రితం పార్టీ నుండి బయటికి వచ్చి కుటుంబంతో మామూలు జీవితం గడుపుదామని నిర్ణయించుకున్నానని తెలియచేసిందని కుటుంబ సభ్యులు చెప్పినట్టు పత్రికలో వార్త వచ్చింది. తమ కుటుంబంలో కలిసిపోవడానికి వస్తుందన్న సంతోషం తో ఉన్న తమకు తమ కూతురు అన్యాయం గా పార్టీ శ్రేణుల చేతిలో హత్యకు గురికావడం చాలా దారుణం అని తల్లీ, సోదరులు చెప్పినట్టు పత్రిక లతో అన్నారు .
ఆమె పార్టీ కి నష్టం కలిగించి ఉంటే ఆమెను పార్టీ నుండి బహిష్కరించే పద్ధతి ఉన్నప్పటికీ ఆమెను హత్య చేయడం అన్యాయం.
మానవీయ సమాజ నిర్మాణం కోసం పని చేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టు లు భవిష్యత్తులో ఇటు వంటి చర్యలకు పూనుకోకుండా, ఉండాలని ప్రజలు, ప్రజా సంస్థలు కోరుతున్నాయి.
- వేమన వసంత లక్ష్మి , ఎస్. జీవన్ కుమార్, ఏ. చంద్ర శేఖర్, వి. ఎస్. కృష్ణ (ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)
- డాక్టర్. ఎస్. తిరుపతయ్య, (తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి )
- ఆత్రం భుజంగ రావు, (తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు)
26.08.2024