కౌలు రైతుల హక్కుల చట్టం తీసుకురావాలి

ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు,కౌలు రైతుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించడం జరిగింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి కి చెందిన కాట్రావుల సాంబమూర్తి 28సంవత్సరాల యువ కౌలు రైతు, అక్కంపేట్ గ్రామానికి చెందిన కడుదుల సంపత్ 57సంవత్సరాల రైతు.. దామెర మండలం లాదెళ్ళ గ్రామానికి చెందిన పకిడే రమేష్ 65సంవత్సరాలు,ఓగులాపూర్ గ్రామానికి చెందిన మన్నెం అనంతరెడ్డి60 సంవత్సరాల కౌలు రైతుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించాము. కార్యక్రమంలో బాధవాత్ రాజు,దిలీప్ పాల్గొన్నారు. పత్రిక ప్రకటన ఇచ్చాము.

డిమాండ్లు:

  1. ప్రస్తుతం నడుస్తున్న శాసన సభలో కౌలు రైతుల హక్కుల చట్టం ప్రవేశపెట్టి చట్టం చెయ్యాలి
  2. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలన్నిటిని ఆర్థికంగా ఆదుకోవాలి.
  3. అన్ని పంటలకు మద్దతు ధరను ప్రకటించాలి.
  4. నకిలీ విత్తనాలు, ఎరువులు ,పురుగు మందులను అరికట్టాలి.
  5. కౌలు రైతులకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి వ్యవసాయానికి పెట్టుబడి సాయం చెయ్యాలి.

హన్మకొండ ,
23.12.2024

Related Posts

Scroll to Top